హైదరాబాద్, సెప్టెంబర్ 6: తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టీఎస్కాబ్)కు 2020-21కిగాను అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు రాష్ట్ర సహకార బ్యాంకుల జాతీయ సమాఖ్య (నాఫ్స్కాబ్) ప్రథమ బహుమతిని ప్రకటించింది. అలాగే 2021-22కుగాను ద్వితీయ బహుమతి వచ్చిందని ఓ ప్రకటనలో టీఎస్కాబ్ తెలిపింది. సహకార శిక్షణ సంస్థల విభాగంలో టీఎస్కాబ్-సీటీఐకి 2020-21, 2021-22కు ప్రథమ బహుమతులు వచ్చాయి.
కరీంనగర్ జిల్లా సహకార బ్యాంక్‌కు, చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి కూడా ఉత్తమ పురస్కారాలు దక్కాయి. ఈ నెల 26న జైపూర్ (రాజస్థాన్)లో ఈ అవార్డుల ప్రదానం జరుగుతుంది. కాగా, గతంలోనూ టీఎస్కాబ్కు నాఫ్స్కాబ్ నుంచి అత్యుత్తమ ప్రతి భా పురస్కారాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అవార్డులపట్ల టీఎస్కాబ్ అధ్యక్షుడు కొండూరు రవీందర్రావు, ఎండీ నేతి మురళీధర్‌లు హర్షం వ్యక్తం చేశారు.