హైదరాబాద్(సిటీబ్యూరో), మార్చి 11 (నమస్తే తెలంగాణ): ప్రతి అంశంలోనూ వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నది ‘టీ హబ్. తాజాగా మీడియా,ఎంటర్టైన్మెంట్ డొమైన్లో విద్యార్థులు, నిపుణులకు శిక్షణ ఇచ్చేందుకు సరికొత్త వేదికను ఏర్పాటు చేశారు. సినీప్రెన్యూర్ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని మీడియా, ఎంటర్టైన్మెంట్ ఈ-స్కూల్ (మీస్కూల్), టీ ఫౌండేషన్లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని టీ హబ్ నిర్వాహకులు తెలిపారు. ఈ రంగంలో వ్యాపార వేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించనున్నారు. దీనికి సంబంధించి మీస్కూల్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ ప్రతిభ పులిజాలతో టీహబ్ (ఎకోసిస్టం ఇన్నోవేషన్) వైస్ ప్రెసిడెంట్ శ్రీరాం అయ్యర్ శుక్రవారం ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సినీ ప్రెన్యూర్ కార్యక్రమం దేశంలోని మొట్ట మొదటిది.