హైదరాబాద్ (శామీర్పేట), మే 16: వినియోగదారుల పట్ల ఎలా మర్యాదగా నడుచుకునేదానిపై రిజర్వు బ్యాంక్ అధికారులకు హైదరాబాద్లో శిక్షణ శిబిరం ప్రారంభమైంది. మూడు వారాల పాటు జరగనున్న ఈ కార్యక్రమాన్ని నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయం రిజిస్టార్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం ఆర్బీఐ ఉద్యోగుల ముఖ్య విధి అని, ప్రధానంగా వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, డిజిటలైజేషన్, కొవిడ్ పరిణామాలతో బ్యాంకింగ్ రంగం ఎలా ప్రభావితం అయ్యిందనే విషయాలపై ఈ సమావేశంలో చర్చించారు. క్రిప్టో, బిట్ కాయిన్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, పాలసీలు, బ్యాంకింగ్ నియమ నిబంధనలు, ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థలు, ఆర్బీఐ విసృత అధికారాలు, పరిమితులు అనే అంశాలపై వచ్చే నెల 3 వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి.