న్యూఢిల్లీ, జూలై 15: హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న సాయి లైఫ్ సైన్సెస్..స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నది. ఇందుకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది కూడా. వ్యాపార విస్తరణకోసం అవసరమయ్యే నిధు ల్లో రూ.800 కోట్ల నిధులను ఐపీవో ద్వారా సేకరించడానికి సిద్ధమైంది.
ప్రమోటర్లు, షేరుహోల్డర్లు, ఇన్వెస్టర్ షేరుహోల్డర్లకు చెందిన 6.15 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూట్లో విక్రయించనున్నారు. వాటాలు విక్రయించనున్న ప్రమోటర్లలో సాయి క్విస్ట్ సైన్ ప్రైవేట్ లిమిటెడ్, టీపీజీ ఆసియా 8 ఎస్ఎఫ్ పీటీఈ లిమిటెడ్, హెచ్బీఎం ప్రైవేట్ ఈక్విటీ ఇండియాలు ఉన్నాయి.