Toyota Urban Cruise Hyryder | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి. ఆ జాబితాలో టయోటా కిర్లోస్కర్ కూడా చేరిపోయింది. తాజాగా కార్ల వినియోగదారులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అర్బన్ క్రూయిజర్ హై రైడర్ మోడల్ కారు శుక్రవారం మార్కెట్లో తీసుకొచ్చింది. ఈ కారు నాలుగు వేరియంట్లలో వినియోగదారులకు లభ్యం అవుతుంది.
రూ.15.11 లక్షల నుంచి రూ.18.99 లక్షల మధ్య ఈ కారు వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నది. గత జూలైలోనే దీన్ని టయోటా ఆవిష్కరించింది. ఇది హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్తోపాటు త్వరలో మార్కెట్లోకి రానున్న మారుతి గ్రాండ్ విటారా వేరియంట్ కార్లతో తల పడనున్నది.
సెల్ఫ్ చార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రీడ్ పవర్ ట్రైన్‌తోపాటు అర్బన్ క్రూయిజర్ హైరైడర్ నియో డ్రైవ్ కారు అందుబాటులో ఉంటుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, తొమ్మిది అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్, వైర్లెస్ చార్జర్, ఏడంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఐ-కనెక్ట్ క్రూయిజ్ కంట్రోల్ తదితర ఫీచర్లు ఉంటాయి.
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లో రెండు ఇంజిన్ చాయిస్‌లు ఆఫర్ చేస్తున్నారు. టయోటా డెవలప్ చేసిన లీటర్ టీఎన్జీఏ అట్కిన్సన్ సైకిల్ ఇంజిన్ 92 హార్స్పవర్, 122 ఎన్ఎం టార్చ్ వెలువరిస్తుంది. న్యూ బ్రెజాలో మారుతి సుజుకి వాడుతున్న 1.5 లీటర్ల కే15సీ మైల్డ్ హైబ్రీడ్ ఇంజిన్ కూడా ఇందులో లభిస్తుంది.