Toyota Innova Crysta | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా దేశీయ మార్కెట్లోకి లిమిటెడ్ స్పెషల్ ఎడిషన్ ఇన్నోవా క్రిస్టాను ఆవిష్కరించింది. ఇన్నోవా క్రిస్టా జీఎక్స్ పెట్రోల్ వేరియంట్ కారు ఆధారంగా స్పెషల్ ఇన్నోవా క్రిస్టా రూపుదిద్దుకున్నది. మాన్యువల్ మోడల్ కారు రూ.17.45 లక్షలు, ఆటోమేటిక్ వర్షన్ కారు రూ.19.02 లక్షలకు లభిస్తుంది. దీంతోపాటు ఈ కారు కొనుగోలు దారులు టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, వైర్లెస్ చార్జింగ్ ఫర్ ఫోన్స్, హెడ్అప్ డిస్ప్లే వంటి విడి భాగాలు డీలర్ల వద్ద తీసుకోవచ్చు. ఇందుకు అదనంగా రూ.55 వేలు చెల్లించాల్సి ఉంటుంది. లిమిటెడ్ ఎడిషన్ ఇన్నోవా క్రిస్టా మోడల్ కారు వచ్చేనెలాఖరు నాటికి మార్కెట్లో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.
2.7 అంగుళాల ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్తో ఇన్నోవా క్రిస్టా వస్తున్నది. ఇది గరిష్టంగా 16 పీఎస్ పవర్, 245 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 5-స్పీడ్ ఎంటీ లేదా 6-స్పీడ్ ఏటీ సామర్థ్యంతో రూపుదిద్దుకున్నది. 150 పీఎస్ పవర్, 360 ఎన్ఎం టార్చితో కూడిన 2.4 లీటర్ల డీజిల్ ఇంజిన్ మోడల్ కార్లు ప్రస్తుతం విక్రయించడం లేదని టయోటా ప్రకటించింది. 2.4 లీటర్ల ఇంజిన్ సామర్థ్యం గల ఇన్నోవా క్ట్రిస్టా కోసం వెయిటింగ్ పీరియడ్ టైం పెరిగిపోవడంతో ఎంవీపీ మోడల్ కారు కోసం అధికంగా డిమాండ్ ఉందని టయోటా తెలిపింది.
టయోటా ఇన్నోవా క్రిస్టాలో ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ప్లేతోపాటు అనుకూలమైన 8- అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లభిస్తున్నది. ఎంవీపీలో సిక్స్ స్పీకర్ సిస్టమ్, ఏడు ఎయిర్బ్యాగ్స్ వరకు సేఫ్టీ ఫీచర్లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఐసోఫిక్స్ యాకోరేజెస్, ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సర్లు ఉన్నాయి.