Auto | జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలు టయోటా, హోండా, సుజుకి భారత్‌లో భారీ పెట్టబడులు పెట్టనున్నాయి. ఆయా కంపెనీలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గిస్తున్న కంపెనీలు.. భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా భావిస్తున్నాయి. ఈ కంపెనీలు భారత్‌లో సుమారు 11 బిలియన్లు (సుమారు రూ.90వేలకోట్లు) పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ టయోటా.. భారత్‌లో దాదాపు 40 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్న సుజుకి రెండూ పెట్టుబడులు పెట్టినట్లుగా ప్రకటించాయి. హోండా తన ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి, ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పింది. జపాన్ కార్ కంపెనీలు మార్కెట్‌తో పాటు తయారీ విషయంలో చైనా అంటేనే భయపడుతున్నాయి.
చైనాలో ఈవీ విభాగంలో కొనసాగుతున్న ధరల యుద్ధం జపనీస్ ఆటోమేకర్స్ లాభాలు ఆర్జించడం కష్టతరంగా మారిందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా చైనా ఆటోమేకర్స్ ఆగ్నేయాసియాలో తమ ఉనికిని విస్తరిస్తున్నాయి. దాంతో జపాన్‌కు ప్రత్యక్షంగా సవాల్‌గా మారుతున్నది. లండన్‌లోని పెల్హామ్ స్మిథర్స్ అసోసియేట్స్‌లో ఆటో విశ్లేషకురాలు జూలీ బూట్ మాట్లాడుతూ.. చైనాకు భారత్ మెరుగైన ప్రత్యామ్నాయం. జపాన్ కంపెనీలు బీవైడీ వంటి చైనా పోటీ ఉండదని పేర్కొన్నారు. 2021-2024 మధ్య భారత్ రవాణారంగంలో (ఆటోమొబైల్స్ సహా) జపాన్ పెట్టుబడి ఏడు రెట్లు పెరిగి 294 బిలియన్ యెన్లకు (సుమారు రూ.16వేలకోట్లు) చేరుకుంది. అదే కాలంలో చైనాలో పెట్టుబడి 83 శాతం తగ్గి 46 బిలియన్ యెన్లకు చేరుకుంది.
ఖర్చులను తగ్గించడానికి హైబ్రిడ్ కారు విడిభాగాల స్థానిక ఉత్పత్తిని పెంచడానికి టయోటా ప్రస్తుతం భారతీయ విక్రేతలతో కలిసి పనిచేస్తోంది. 2030 నాటికి భారతదేశంలో 15 కొత్త, అప్డేటెడ్ మోడల్స్‌ను ప్రారంభించాలని.. రూరల్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దక్షిణ భారత్‌లోని ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏటా లక్ష వాహనాలకు పెంచుతామని, మహారాష్ట్రలో కొత్త ప్లాంట్‌ను నిర్మిస్తామని టయోటా గతేడాది ప్రకటించింది. ఇది 2030కి ముందు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది కంపెనీ మొత్తం సామర్థ్యాన్ని ఏటా మిలియన్ వాహనాలకుపైగా పెంచనున్నది.
సుజుకి తన భారతీయ యూనిట్ మారుతి సుజుకి ద్వారా 8 బిలియన్ డాలర్లు (రూ.67వేలకోట్లు) పెట్టుబడి పెడుతోంది. భారత్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని సంవత్సరానికి 2.5 మిలియన్ల నుంచి నాలుగు మిలియన్లకు కార్లకు పెంచనున్నది. సుజుకి అధ్యక్షుడు తోషిహిరో సుజుకి మాట్లాడుతూ.. భారత్‌ను సుజుకి ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా మార్చాలని, ఇక్కడి నుంచే ఎగుమతులను పెంచాలని తాము కోరుకుంటున్నామన్నారు.
హోండా భారత్‌ను ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన (EV) వ్యూహంలో కీలక భాగంగా చేస్తోంది. భారత్‌లో ‘జీరో సిరీస్’ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసి 2027 నుంచి జపాన్, ఇతర ఆసియా దేశాలకు ఎగుమతి చేయాలని కంపెనీ యోచిస్తున్నది. భారత్ ప్రస్తుతం యూఎస్ తర్వాత తమకు రెండో కీలకమైన మార్కెట్ అని హోండా సీఈవో తోషిహిరో మిబే పేర్కొన్నారు. భారతదేశ సగటు జీడీపీ వృద్ధి 8శాతం, పీఎం మోదీ మేక్ ఇన్ ఇండియా విధానం విదేశీ కంపెనీలకు పెట్టుబడులకు ఆకర్షణీయంగా మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. చైనా కంటే భారత్ మార్కెట్లో జపాన్ కంపెనీలకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.
ఎస్ఎండ్పీ గ్లోబల్ మొబిలిటీకి చెందిన గౌరవ్ వంగల్ ప్రకారం.. ఈ విధానం జపనీస్ కంపెనీలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. భారతీయ కంపెనీల కంటే బలవమైన ఖర్చు ప్రయోజనం ఉంటుంది. దేశీయ ఆటో కంపెనీలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్యూవీ విభాగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. సుజుకి మార్కెట్ వాటాను సవాల్ చేస్తున్నాయి. కొవిడ్ మహమ్మారికి ముందు భారత ప్యాసింజర్ కార్ల మార్కెట్లో సుజుకి వాటా దాదాపు 50 శాతం ఉండేది. ప్రస్తుతం అది 40శాతానికి తగ్గింది. జపనీస్ కార్ కంపెనీలు భారత్ వైపు మొగ్గు చూపడానికి కేవలం వ్యాపారం మాత్రమే కాకుండా ప్రపంచ సరఫరా గొలుసు పునర్నిర్మాణానికి నాంది అని.. ఇకపై కేవలం ఒక ప్రధాన మార్కెట్ మాత్రమే కాకుండా రాబోయే దశాబ్దంలో జపాన్‌కు అత్యంత ముఖ్యమైన ఆటో తయారీ కేంద్రంగా మారే దిశగా భారత్ పయనిస్తోందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.