Toyota cars expensive | పైపైకి టయోటా ఇన్నోవా క్రిస్టా ధర..
Toyota cars expensive | రేడియం, పల్లాడియం, స్టీల్ వంటి కీలక లోహాల ధరలు పెరగడంతో ఇన్నోవా క్రిస్టా మోడల్ కారు ధర పెంచుతున్నట్లు టయోటా కిర్లోస్కర్...

Toyota cars expensive | జపాన్ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ ప్రత్యేకించి తన ఫ్లాగ్షిప్ మోడల్ ఇన్నోవా క్రిస్టా కారు ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. దీని ధర ఆదివారం (ఆగస్టు 1) నుంచి రెండు శాతం పెంచుతున్నట్లు శనివారం తన వెబ్సైట్లో వెల్లడించింది. కార్ల తయారీ ఖర్చులు నిరంతరం పెరిగిపోయాయని, తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచక తప్పడం లేదని పేర్కొంది. ఈ మేరకు ఆదివారం నుంచి పెరుగనున్న కార్ల ధరలను వెబ్సైట్లో ప్రచురించింది.
రేడియం.. పల్లాడియం ధరలు పైపైకి..
కార్ల తయారీలో కీలకమైన రేడియం, పల్లాడియం వంటి ప్రతిష్ఠాత్మక లోహాల ధరలు గత ఏడాది కాలంగా పెరిగాయి. అలాగే స్టీల్ ధరలు మరింత ప్రియం అయ్యాయి. టయోటా కిర్లోస్కర్ ఇన్నోవా క్రిస్టా ఎంవీపీ వేరియంట్ భారత్ మార్కెట్లో 18 వేరియంట్లలో లభిస్తుంది.
రూ.16.52 లక్షల నుంచి షురూ..
టయోటా కిర్లోస్కర్ ఇన్నోవా క్రిస్టా సెవెన్ సీటర్ కారు ధర రూ.16.52 లక్షల నుంచి మొదలవుతుంది. ఇది 2.7 లీటర్ల జీఎక్స్ 7-సీటర్ పెట్రోల్ వేరియంట్. ఇక టాప్-స్పెక్ 2.4 లీటర్ల జడ్ఎక్స్ సెవెన్ సీటర్ కారు మోడల్ ధర రూ.24.59 లక్షలు పలుకుతుంది.
ఇతర కార్ల సంస్థలు కూడా..
ఇతర కార్ల తయారీ సంస్థలు కూడా ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కూడా కార్ల ధరలు పెంచేసింది. స్విఫ్ట్ వంటి ఇతర వేరియంట్ కార్ల ధరలు రూ.15 వేలు పెంచుతున్నట్లు ఈ నెల ప్రారంభంలోనే ప్రకటించింది. వచ్చేవారం టాటా మోటర్స్ కార్ల ధరలు పెరుగుతాయి. వచ్చేనెలలో హోండా కార్స్ ధరలు పెంచనున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి:
Home Loan Tips | ఈ పంచ సూత్రాలు పాటిస్తే హోంలోన్ ఈజీ.. ఎలాగంటే?!
ICICI Bank alert | ఆగస్టు నుంచి ఖాతాదారుల లావాదేవీలపై చార్జీల మోత..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- innova crysta
- toyota
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

