న్యూఢిల్లీ, ఏప్రిల్ 7 : దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 24.52 లక్షల యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. అంతక్రితం ఏడాది అమ్ముడైన వాహనాలతో పోలిస్తే ఇది 24.6 శాతం అధికమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్(ఫాడా) ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు. వీటిలో 14 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అమ్ముడవగా, 2 లక్షల యూనిట్ల ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలు ఉన్నాయన్నారు. దేశీయ ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో గతేడాది చిరస్థాయిగా మిగిలిపోనున్నట్టు, ద్వి-త్రి చక్ర వాహనాలతోపాటు ప్యాసింజర్, కమర్షియల్ వాహనాలు రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నట్టు చెప్పారు.