Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో టాప్-10 సంస్థల్లో ఐదు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,13,117.17 కోట్లు వృద్ధి చెందింది. భారతీ ఎయిర్టెల్ భారీగా లబ్ధి పొందగా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ఐసీ నష్టపోయాయి. గతవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 623.07 పాయింట్లు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 90.5 పాయింట్లు వృద్ధి చెందాయి.
భారతీ ఎయిర్ టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.47,836.6 కోట్ల వృద్ధితో రూ.9,57,842.40 కోట్లకు చేరుకున్నది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.31,826.97 కోట్లు పెరిగి రూ.8,30,387.10 కోట్లకు చేరుకున్నది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.11,887.78 కోట్లు పుంజుకుని రూ.14,31,158.06 కోట్ల వద్ద స్థిర పడింది. ఐసీఐసీఐ బ్యాంకు ఎం-క్యాప్ రూ.11,760.8 కోట్ల లబ్ధితో 9,49,306.37 కోట్లకు చేరింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎం-క్యాప్ రూ.9,805.02 కోట్లు పుంజుకుని రూ.16,18,587.63 కోట్లకు చేరుకున్నది.
మరోవైపు, రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.52,031.98 కోట్ల పతనంతో రూ.17,23,144.70 కోట్ల వద్ద నిలిచింది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఎం-క్యాప్ రూ.32,067.73 కోట్ల నష్టంతో రూ.5,89,869.29 కోట్ల వద్ద ముగిసింది. హిందూస్థాన్ యూనీ లివర్ ఎం-క్యాప్ రూ.22,250.63 కోట్లు పతనమై రూ.5,61,423.08 కోట్లకు చేరుకున్నది. ఎస్బీఐ ఎం-క్యాప్ రూ.2,052.66 కోట్లు, ఐటీసీ ఎం-క్యాప్ రూ.1,376.19 కోట్లు కోల్పోయాయి. గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో రిలయన్స్ మొదటి స్థానంలో కొనసాగుతున్నది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎల్ఐసీ, హిందూస్థాన్ యూనీ లివర్, ఎస్బీఐ, ఐటీసీ నిలిచాయి.