Top AMT Cars | కరోనా మహమ్మారి తర్వాత పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం పెరిగింది. ప్రతి ఒక్కరూ తమ బడ్జెట్లోనే సులభంగా, సౌకర్యవంతంగా, హాయిగా ప్రయాణించే వెసులుబాటు గల కార్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ కార్లలో ఏది బెటర్ అన్న అంశం ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. కార్లు కొనుగోలు చేసే వారి సౌకర్యం, బడ్జెట్, ఫ్యుయల్ మైలేజీ, సొంత ప్రయోజనాలు కూడా కీలకం అవుతున్నాయి. ప్రస్తుతం ప్రతి వస్తువు ప్రియంగా మారిన పరిస్థితుల్లో అందుబాటు ధరలో ఉన్న ఎస్యూవీ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ దశలో టాప్ సెల్లింగ్ కార్ల గురించి తెలుసుకుందాం..

ప్రస్తుత మార్కెట్లో మారుతి సుజుకి అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉన్నది. అందునా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (ఏఎంటీ) ఆప్షన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ కారు 1.0-లీటర్ల కే-10 ఇంజిన్‌తో వస్తున్నది. ఈ ఇంజిన్ గరిష్టంగా 65.7 హెచ్‌పీ విద్యుత్, 89 ఎన్ఎం టార్చి వెలువరిస్తున్నది. 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్‌తో అందుబాటులో ఉన్న ఈ కారు ధర రూ.5.76 లక్షలు (ఎక్స్ షోరూమ్).

అందుబాటు ధరలో ఉన్న మరో హ్యాచ్‌బ్యాక్ కారు రెనాల్ట్ క్విడ్. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (ఏఎంటీ) ఆప్షన్‌తో వచ్చిన ఈ కారు ధర రూ.6.12 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు 1.0 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 66.1 హెచ్‌పీ విద్యుత్, 91 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది.

వీఎక్స్ఐ ఏజీఎస్ వేరియంట్ మారుతి సుజుకి సెలెరియో ప్రస్తుతం పాపులర్ మాస్ మోడల్ కారు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (ఏఎంటీ) ఆప్షన్లో లభిస్తున్న ఈ కారు 1.0 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో వస్తున్నది. ఈ ఇంజిన్ 64.8 హెచ్‌పీ విద్యుత్, 89 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 5-స్పీడ్ ఏఎంటీ ఆప్షన్ గల ఈ కారు ధర రూ.6.38 లక్షలు (ఎక్స్ షోరూమ్).

ఓజీ టాల్ బాయ్.. మారుతి వ్యాగన్-ఆర్ కారు ఏఎంటీ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది. ఈ కారు 1.0-లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 64.8 హెచ్‌పీ విద్యుత్, 89 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఈ కారు ధర రూ.6.54 లక్షలు (ఎక్స్ షోరూమ్).