Honda Amaze | ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా ఇండియా (Honda India) తన థర్డ్ జనరేషన్ సబ్ కంపాక్ట్ అమేజ్ (Amaze) కారు దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.7.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమై రూ.10.89 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పలుకుతుంది. ఇవీ ఇంట్రడ్యూసరీ ధరలు అని, 45 రోజుల వరకూ బుకింగ్ చేసుకునే వారికి ఈ ధరలు వర్తిస్తాయి. వీ, వీఎక్స్, జడ్ఎక్స్ వేరియంట్లలో న్యూ అమేజ్ లభిస్తుంది.
న్యూ మారుతి సుజుకి డిజైర్, హ్యుండాయ్ ఔరా, టాటా టైగోర్ వంటి పాపులర్ కంపాక్ట్ సెడాన్లతో పోటీ పడుతుంది. సెకండ్ లెవల్ అడాస్ షూట్ తో వస్తున్న హోండా అమేజ్ (Honda Amaze) అత్యంత పాపులర్ కారు. కొల్లిషన్ మిటిగేషన్ బ్రేకింగ్, ఆటో హై బీం, అడ్వాన్స్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్ట్, రోడ్ డిపార్చర్ మిటిగేషన్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఆసక్తి గల కస్టమర్లు ఆన్లైన్లో గానీ, సమీప డీలర్ల వద్ద గానీ బుక్ చేసుకోవచ్చు. 2025 జనవరి నుంచి డెలివరీలు ప్రారంభిస్తారు.
హోండా న్యూ అమేజ్ (Amaze) కారు 1.2 లీటర్ల, ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ లేదా సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తదితర ఫీచర్లు ఉంటాయి. హోండా లేన్ వాచ్ కెమెరా ఉంటుంది. ఇది బ్లైండ్ స్పాట్ మానిటర్ మాదిరిగా పని చేస్తుంది.
హోండా అమేజ్ వీ వేరియంట్ ఎంట్రీ లెవెల్ కారు. పవర్ అడ్జస్టబుల్, బాడీ కలర్డ్ ఓఆర్వీఎంస్ విత్ ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్, 8-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, సెమీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, 7- అంగుళాల ఎంఐడీ ఉంటాయి. వాయిస్ కమాండ్స్, 4-స్పీకర్ సౌండ్ సిస్టమ్, మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, 4-స్పీకర్ సౌండ్ సిస్టమ్, టిల్ట్ స్టీరింగ్ అడ్జస్ట్, 14 అంగుళాల స్టీల్ వీల్స్ విత్ కవర్స్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ విత్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్, షార్క్ ఫిన్ యాంటినా ఉంటాయి. హోండా అమేజ్ వీ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ రూ.8 లక్షలు (ఎక్స్ షోరూమ్), సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ రూ.9.20 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.
ఫ్యాబ్రిక్ అప్ హోల్స్టరీ, రేర్ ఆర్మ్ రెస్ట్ విత్ కప్ హోల్డర్స్, పెడల్ షిఫ్టర్స్ (సీవీటీ), కీ లెస్ ఎంట్రీ, ఎలక్ట్రికల్ ట్రంక్ లాక్ విత్ కీలెస్ రిలీజ్, ఆల్ ఫోర్ పవర్ విండోస్, 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), ట్రాక్షన్ కంట్రోల్, డే / నైట్ ఇన్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్, 3- పాయింట్ సీట్ బెల్ట్స్, హెడ్ రీస్ట్రైంట్స్ ఫర్ ఆల్ సీట్స్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, రేర్ పార్కింగ్ సెన్సర్లు అండ్ కెమెరాలు ఉంటాయి.
హోండా అమేజ్ మిడ్ స్పెషిఫికేసన్ వీఎక్స్ ట్రిమ్ కారు మాన్యువల్ ట్రాన్స్ మిషన్ వేరియంట్ రూ.9.10 లక్షలు (ఎక్స్ షోరూమ్), సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వేరియంట్ రూ.10 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. అదనంగా ఎల్ఈడీ ప్రొజెక్టర్ ఫాగ్ లాంప్స్, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, పవర్ ఫోల్డింగ్ వింగ్ మిర్రర్స్ తోపాటు సాటిన్ మెటాలిక్ గార్నిష్ ఆన్ డాష్ బోర్డ్, పుష్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్, ఆటో హెడ్ ల్యాంప్స్, వైపర్స్, రేర్ డీఫాగర్, రిమోట్ ఇంజిన్ స్టార్ట్ (సీవీటీ), ఆటో క్లైమేట్ కంట్రోల్ విత్ మ్యాక్స్ కూల్ మోడ్, రేర్ ఏసీ వెంట్స్, వైర్ లెస్ చార్జర్, కనెక్టెడ్ కార్ టెక్ విత్ అలెక్సా కంపాటిబిలిటీ, టూ అడిషనల్ ట్వీటర్లు, రేర్ వ్యూ కెమెరా, లేన్ వాచ్ కెమెరా ఉంటాయి.
టాప్ స్పెక్ జడ్ఎక్స్ ట్రిమ్ కారు డ్యుయల్ టోన్ 15-అంగుళాల వీల్స్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి హోండా సెన్స్ అడాస్ ఫీచర్లు, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, లేన్ కీపింగ్ అసిస్ట్, ఆటో హై బీం తదితర ఫీచర్లు ఉంటాయి. రేడియంట్ రెడ్ మెటాలిక్, ఒబ్సిడియాన్ బ్లూ పెరల్, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్, మీటరాయిడ్ గ్రే మెటాలిక్, లునార్ సిల్వర్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెరల్ రంగుల్లో అమేజ్ కారు లభిస్తుంది.
1.2 లీటర్ల 4-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ విత్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ లేదా సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 90 హెచ్పీ విద్యుత్ – 110 ఎన్ఎం టార్చ్ వెలువరిస్తుంది. సీవీటీ మోడల్ కారు లీటర్ పెట్రోల్ పై 19.46 కి.మీ, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ 18.65 కి.మీ మైలేజీ ఇస్తుంది. మూడేండ్లు స్టాండర్డ్ వారంటీతోపాటు దాన్ని అపరిమిత దూరంతోపాటు ఏడేండ్ల వరకూ పొడిగించుకునే అవకాశం ఉంటుంది. అప్ రైట్ గ్రిల్లె, ట్విన్ పాడ్ ప్రొజెక్టర్ హెడ్ లైట్స్, సింపుల్ అండ్ నీట్ బంపర్ డిజైన్ విత్ ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ తదితర ఫీచర్లు ఉంటాయి.