HDFC Bank | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 కంపెనీల్లోని ఏడు సంస్థలు సుమారు రూ.74,603.06 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టపోయాయి. వాటిల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకు అత్యధికంగా రూ.25,011 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ విలీనం వల్లే ఆ సంస్థ ఎం-క్యాప్ పతనమైందని తెలుస్తున్నది. దీంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.12,22,392.26 కోట్ల వద్ద స్థిరపడింది.
ఐసీఐసీఐ బ్యాంకుతోపాటు హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఇన్ఫోసిస్, ఐటీసీ ఎం-క్యాప్ భారీగా నష్టపోగా, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మార్కెట్ క్యాపిటలైజేషన్ పుంజుకున్నది.
ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12,781 కోట్లు కోల్పోయి రూ.6,66,512.90 కోట్ల వద్ద స్థిర పడింది. భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ.11,096.48 కోట్ల పతనంతో రూ.4,86,812.08 కోట్లతో సరిపెట్టుకున్నది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ.10,396.94 కోట్ల నష్టంతో రూ.5,87,902.98 కోట్ల వద్ద ముగిసింది. ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,726.3 కోట్ల పతనంతో రూ.5,59,159.71 కోట్ల వద్ద నిలిచింది.
బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ.4,935.21 కోట్ల పతనంతో రూ.4,27,996.97 కోట్లకు చేరుకున్నది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.2,656.31 కోట్ల నష్టంతో రూ.5,69,406.39 కోట్ల వద్ద ముగిసింది.
రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేసన్ రూ.25,607.85 కోట్లు పుంజుకుని రూ.17,28,878.59 కోట్ల వద్దకు చేరుకున్నది. టీసీఎస్ ఎం-క్యాప్ రూ.2,579.64 కోట్లు పెరిగి రూ.12,62,134.89 కోట్లకు దూసుకెళ్లింది. ఎస్బీఐ ఎం-క్యాప్ రూ.847.84 కోట్లు పెరిగి రూ.5,12,451.22 కోట్ల వద్ద స్థిర పడింది.
గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో రిలయన్స్ లీడ్లో కొనసాగుతుండగా, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్, ఇన్పోసిస్, ఐటీసీ, ఎస్బీఐ, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్ నిలిచాయి. గతవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 398.6 పాయింట్లు (0.60 శాతం) నష్టంతో ముగిసింది.