న్యూఢిల్లీ, జూలై 7: ముకేశ్ అంబానీ హవా కొనసాగుతున్నది. ప్రస్తుత నెలకుగాను ఫోర్బ్స్ మ్యాగజైన్ దేశీయ శ్రీమంతుల జాబితాను విడుదల చేసింది. దీంట్లో ముకేశ్ అంబానీ 115 బిలియన్ డాలర్ల సంపదతో తొలిస్థానంలో నిలిచారు.
67.0 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ ఆ తర్వాతి స్థానంలో నిలిచారు. వీరితోపాటు శివ్ నాడార్ 38 బిలియన్ డాలర్లతో ఆ తర్వాతి స్థానం దక్కించుకున్నారు. 37.4 బిలియన్ డాలర్లతో సావిత్రి జిందాల్ కుటుంబానికి నాలుగోస్థానం దక్కింది.