సోమవారం 08 మార్చి 2021
Business - Dec 16, 2020 , 13:43:54

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..

ముంబై: మంగళవారం భారీ నష్టాలనుంచి కోలుకొని, స్వల్పలాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. నిన్నచివరి గంటలో సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడటంతో నష్టాల నుంచి బయటపడింది. సెన్సెక్స్ 288.89 పాయింట్లు అంటే 0.62శాతం లాభపడి 46552.06 పాయింట్ల వద్ద, నిఫ్టీ 83.50 పాయింట్లు అంటే 0.62శాతం లాభపడి 13651.40 వద్ద ప్రారంభమైంది. 1094 షేర్లు లాభాల్లో, 250 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 48 షేర్లలో ఎలాంటి మార్పులేదు. ఆ తర్వాత సెన్సెక్స్ 300 పాయింట్లు లాభపడి 46,563 పాయింట్ల వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు ఎగిసి 13,653 పాయింట్ల వద్ద ఉన్నది. డాలర్ మారకంతో రూపాయి 17 పైసలు లాభపడి 73.47 వద్ద ప్రారంభమైంది. క్రితం సెషన్‌లో 73.64 వద్ద ముగిసింది.  

ఇవి కూడా చదవండి... వేగం పుంజుకోనున్నభారత ఆర్థికవ్యవస్థ...
క్విజ్ లో గెలవండి.. రూ.25వేల అమెజాన్ పే బ్యాలెన్స్‌ పొందండి...

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి

VIDEOS

logo