న్యూయార్క్, నవంబర్ 15: అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ నాయకత్వంలో భారీ మార్పులు జరగబోతున్నాయా..అవుననే అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం సీఈవోగా వ్యవహరిస్తున్న టిమ్ కుక్ తన పదవి నుంచి వైదొలగడానికి సిద్ధమవుతున్నాడని ఫైనాన్షియల్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచూరించింది. దీంతో కంపెనీ బోర్డు నూతన సీఈవో కోసం వెతుకులాట ప్రారంభించింది.
అలాగే ప్రస్తుతం కంపెనీ హార్డ్వేర్ ఇంజినీరింగ్ విభాగానికి సీనియర్ ప్రెసిడెంట్గా విధులు నిర్వహిస్తున్న జాన్ తెర్నాస్తో ఈ స్థానాన్ని భర్తి చేయాలనుకుంటున్నది. దీనిపై కంపెనీ ప్రతినిధి స్పందించడానికి నిరాకరించారు. గడిచిన 14 ఏండ్లుగా ఆయన కంపెనీ సీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు.