TiE MOU with SNC | స్టార్టప్‌లు, ఇన్నోవేటర్లకు మార్కెట్లో ప్రవేశానికి, నెట్వర్కింగ్ మద్దతు అందించేందుకు ఇజ్రాయెల్ స్టార్టప్ నేషనల్ సెంట్రల్ (ఎస్ఎన్సీ) అనే సంస్థతో టీఐఈ హైదరాబాద్, టీఐఈ ఇజ్రాయెల్ జత కట్టాయి. ఇందుకోసం ఎస్ఎన్సీతో అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. వ్యవసాయం, జల, ఇంధన రంగాల్లో పని చేస్తున్న స్టార్టప్ సంస్థల బలోపేతానికి కలిసి పని చేస్తూ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని టీఐఈ హైదరాబాద్, టీఐఈ ఇజ్రాయెల్ నిర్ణయించాయి.
ఈ మేరకు సోమవారం టీఐఈ సస్టెయినబిలిటీ సమ్మిట్-2021 (టీఎస్ఎస్-2021)లో ఇరు సంస్థలు ఎంవోయూపై సంతకాలు చేశాయి. వచ్చే 24 నెలల్లో బహుళ రంగ కొహోర్ట్ (cohort)లకు సారధ్యం వహించాలని నిర్ణయించాయి.
భారత్ మార్కెట్లోకి ఇజ్రాయెల్ స్టార్టప్‌లు, ఇజ్రాయెల్ మార్కెట్లోకి భారత్ స్టార్టప్‌లు చొచ్చుకెళ్లేందుకు ఈ రెండు సంస్థలు పరస్పర సహకారం అందించుకుంటాయి. ఇందుకోసం రెండు దేశాల్లోనూ ఆరు స్టార్టప్‌ల చొప్పున ఎంపిక చేశారు. వీటి మధ్య సహకరాన్ని 20 మంది పరిశ్రమల నిపుణులు పర్యవేక్షిస్తారు.ఈ నెలాఖరులోగా అగ్రిటెక్‌లో తొలి కోహోర్ట్ ప్రారంభం అవుతుంది. దీని కొనసాగింపుగా పలు కోహోర్ట్స్ ప్రారంభం అవుతాయి.