Reliance | గతవారం ట్రేడింగ్‌లో టాప్-10 సంస్థల్లో మూడు సంస్థలు రూ.1.22 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. వాటిల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా నష్టపోయింది. ఐటీ దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్ స్క్రిప్ట్‌లు నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. మరోవైపు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్), ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, అదానీ ట్రాన్స్మిషన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.62,221.63 కోట్లు పెంచుకున్నాయి. గణేశ్ చతుర్థి నేపథ్యంలో బుధవారం స్టాక్‌మార్కెట్లకు సెలవు. ఐదు సెషన్లలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 30.54 పాయింట్లు నష్టపోయింది.
భారీగా నష్టపోయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.60,176.75 కోట్లు తగ్గి రూ.17,11,468.58 కోట్లకు పడిపోయింది. టీసీఎస్ ఎం-క్యాప్ రూ.33,663.28 కోట్లు కోల్పోయి రూ.11,45,155.01 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 29,012.22 కోట్లు పతనమై రూ.6,11,339.35 కోట్ల వద్ద స్థిర పడింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.12,653.69 కోట్లు పెరిగి రూ.8,26,605.74 కోట్లకు చేరుకుంది. గతవారం టాప్-10 స్క్రిప్ట్‌లో జత కలిసిన టాటా ట్రాన్స్మిషన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12,494.32 వృద్ధి చెంది రూ.4,30,842.32 కోట్ల వద్ద ముగిసింది. ఆగస్టు 30న టాప్-10 సంస్థల జాబితాలో అదానీ ట్రాన్స్మిషన్ చేరింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11,289.64 కోట్లు పెరిగి రూ.4,78,760.80 కోట్ల వద్ద స్థిర పడింది. హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.9,408.48 కోట్లు లాభపడి రూ.4,44,052.84 కోట్ల వద్ద నిలిచింది. బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,740.41 కోట్ల వృద్ధితో రూ.4,35,346 కోట్లకు దూసుకెళ్లింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) ఎం-క్యాప్ రూ.7,612.68 కోట్లు పెరిగి రూ.6,11,692.59 కోట్ల వద్ద నిలిచింది.
ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,022.41 కోట్లు వృద్ధి చెంది రూ.6,07,352.52 కోట్లకు చేరుకుంది. టాప్-10లో రిలయన్స్ లీడ్ స్థానంలో కొనసాగుతుండగా, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, అదానీ ట్రాన్స్మిషన్ నిలిచాయి.