ముంబై, డిసెంబర్ 29: దేశ ఆర్థిక వ్యవస్థ క్రమేపీ వృద్ధిచెందుతున్నప్పటికీ, కొవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ ప్రధాన సవాలుగా ఉందని రిజర్వ్‌బ్యాంక్ హెచ్చరించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఒత్తిడులకు ఇప్పుడు ఒమిక్రాన్ తోడైందని పేర్కొంది. బుధవారం ఆర్బీఐ విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక.. ముందుమాటలో ఈ విషయాన్ని కేంద్ర బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రస్తావిస్తూ.. 2021 ఏప్రిల్-మే నెలల్లో తీవ్ర రెండో కొవిడ్ వేవ్ తర్వాత వృద్ధి బాగా మెరుగుపడిందని తెలిపారు. ఇటీవల తలెత్తిన ఒమిక్రాన్ వైరస్, ఇతర అంతర్జాతీయ పరిణామాలతో ఆర్థిక వ్యవస్థకు రిస్క్ ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా పుంజుకోవాలంటే ప్రైవేటు పెట్టుబడులు, వినియోగం పెరగాల్సి ఉంటుందని, కానీ ఇవి రెండూ కొవిడ్ ముందస్తు స్థాయికంటే తక్కువే ఉన్నాయని దాస్ వివరించారు.

9.5 శాతానికి ఎన్పీఏలు..
బ్యాంక్‌ల స్థూల మొండి బకాయిలు (ఎన్పీఏలు) 2022 సెప్టెంబర్‌కల్లా 8.1-9.5 శాతానికి పెరగవచ్చని ఆర్థిక స్థిరత్వ నివేదికలో ఆర్బీఐ అంచనా వేసింది. 2021 సెప్టెంబర్‌లో ఇవి 6.9 శాతంగా ఉన్నాయి. పలు సంవత్సరాల నుంచి బ్యాంకుల రుణ వితరణలో ప్రధానంగా ఉన్న రిటైల్ రుణాల్లో ఒత్తిడిస్థాయి పెరుగుతున్నదని, ముఖ్యంగా గృహ రుణాల్లో ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెలకు చేరిందని రిజర్వ్‌బ్యాంక్ పేర్కొంది. ఈ సెప్టెంబర్ నాటికి స్థూల ఎన్పీఏలు 6.9 శాతానికి, నికర ఎన్పీఏలు 2.3 శాతానికి తగ్గినప్పటికీ, ప్రైవేటు రంగ బ్యాంక్‌ల ఆస్తుల నాణ్యత అధికంగా క్షీణిస్తున్నదని కేంద్ర బ్యాంక్ ఆందోళన వ్యక్తంచేసింది. బ్యాంక్‌లపై నిర్వహించిన ఒత్తిడి పరీక్షల ఆధారంగా చూస్తే 2022 సెప్టెంబర్‌కల్లా స్థూల ఎన్పీఏలు కనీసం 8.1 శాతానికి చేరవచ్చని, గరిష్ఠంగా 9.5 శాతాన్ని తాకవచ్చని వివరించింది. ఒమిక్రాన్ వేవ్ దెబ్బ ఆర్థిక వ్యవస్థకు తగిలితే, ప్రస్తుతం 8.8 శాతం ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల ఎన్పీఏలు 10.5 శాతానికి, ప్రైవేట్ బ్యాంక్‌ల మొండి బకాయిలు 4.6 శాతం నుంచి 5.2 శాతానికి, విదేశీ బ్యాంక్లవి 3.2 శాతం నుంచి 3.9 శాతానికి పెరుగుతాయని నివేదిక అంచనా వేసింది.
ద్రవ్యలోటును కట్టడి చేయలేని కేంద్రం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిర్దేశించిన 6.8 శాతానికి ద్రవ్య లోటును అదుపుచేసే అంశమై రిజర్వ్‌బ్యాంక్ సందేహాల్ని వ్యక్తం చేసింది. నికర పన్ను వసూళ్లు భారీగా పెరిగినా, ప్రభుత్వం రూ.3.73 లక్షల కోట్ల గ్రాంటుల కోసం రెండో సంప్లిమెంటరీ డిమాండ్‌ను ప్రవేశపెట్టినందున ఆర్బీఐకి ఈ అనుమానాలు ఏర్పడ్డాయి. ఈ అక్టోబర్‌కల్లా పన్ను వసూళ్లు 82 శాతం వృద్ధితో రూ.10.53 లక్షల కోట్లకు చేరగా, మొత్తం ప్రభుత్వ వ్యయం 9.95 శాతం వృద్ధితో రూ.18.27 లక్షల కోట్లకు పెరిగినట్టు ఆర్బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదిక తెలిపింది. అక్టోబర్ వరకూ లోటు సంకేతాలైన స్థూల ద్రవ్యలోటు, రెవిన్యూ లోటు..కొవిడ్ ముందస్తుస్థాయి నుంచి, గతేడాదితో పోల్చినా మెరుగ్గా ఉన్న నేపథ్యంలో డిసెంబర్లో రూ.3.73 లక్షల కోట్ల గ్రాంట్స్ డిమాండ్‌ను ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టడంతో ద్రవ్య లోటు లక్ష్యం దెబ్బతింటుందని కేంద్ర బ్యాంక్ పేర్కొంది. బడ్జెట్ అంచనాలకు అనుగుణంగానే ప్రభుత్వ రుణాల సేకరణ పరిమాణం ఉండాలని, ప్రభుత్వ తీరు చూస్తుంటే ఈ రుణ సమీకరణ పెరుగుతుందని భావిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.
ఎయిర్ ఇండియాకే 62వేల కోట్లు..
ఎయిర్ ఇండియా రుణాల చెల్లింపునకు రూ.62,000 కోట్లతో సహా మొత్తం రూ.3.73 లక్షల కోట్ల అదనపు వ్యయం కోసం ఈ నెలలో పార్లమెంటు అనుమతిని ప్రభుత్వం కోరింది. ఈ ప్రతిపాదిత వ్యయంలో ఎరువుల సబ్సిడీలకు అదనంగా రూ. 58,000 కోట్లు, వివిధ ఎగుమతి స్కీమ్‌ల కోసం రూ. 53,000 కోట్లు, పెండింగ్‌లో ఉన్న ఎగుమతి ప్రోత్సాహకాల చెల్లింపునకు రూ.53,120 కోట్లు, గ్రామీణ ఉపాధి గ్యారంటీ ఫండ్ కోసం రూ. 22,000 కోట్ల చొప్పున వ్యయాలు ఉన్నాయి.