మెల్బోర్న్ : ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడటం, ఆర్ధిక మందగమనంతో టెక్ దిగ్గజాలు మాస్ లేఆఫ్స్‌తో వణికిస్తున్నాయి. లేఆఫ్స్ ప్రక్రియను (Layoffs) కొనసాగిస్తూ పలు సంస్ధలు వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి.
తాజాగా ఆస్ట్రేలియన్ గ్రాసరీ డెలివరీ స్టార్టప్ మిల్క్రన్ 400 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. ఏప్రిల్ 14న కంపెనీ వ్యాపారాన్ని నిలిపివేస్తున్నట్టు మిల్క్రన్ సహ వ్యవస్ధాపకుడు డేనీ మిల్హం స్పష్టం చేశారు. ఆర్ధిక పరిస్ధితులతో పాటు క్యాపిటల్ మార్కెట్ పరిస్ధితులు దిగజారడంతో తాము సరైన నిర్ణయం తీసుకున్నామని మిల్హం కంపెనీ చర్యను సమర్ధించుకున్నారు.
2021లో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ఈ స్టార్టప్ పురుడు పోసుకుంది. ఇక గ్లోబల్ గ్రాసరీ డెలివరీ ప్లేయర్ గోపఫ్ ఈ ఏడాది మార్చిలో 12 నెలల కాలంలో మూడో దశ లేఆఫ్స్‌ను ప్రకటించింది. ఇక గొరిల్లాస్ వంద మందికి పైగా ఉద్యోగులపై వేటు వేయగా, 2022లో మూడు దేశాల్లో తన కార్యకలాపాలను మూసివేసింది.
Read More