న్యూఢిల్లీ : ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీ లాంఛ్ అయిన తర్వాత చాట్‌బాట్స్‌పై (AI Job) టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ ఊపందుకుంది. ఎన్నో నూతన ఉద్యోగాలు కొత్త టెక్నాలజీతో అందుబాటులోకి వస్తున్నాయి. ఏఐ టెక్నాలజీతో పలు కొలువులు కనుమరుగవుతున్నా ఆకట్టుకునే వేతనాలతో సరికొత్త ఉద్యోగాలు ఔత్సాహికుల ముందుకొస్తున్నాయి.
ప్రాంప్ట్ ఇంజనీరింగ్ జాబ్ రూ. 2.77 కోట్ల వార్షిక వేతనంతో క్రేజీ జాబ్‌గా టెకీలను ఆకట్టుకుంటోంది. ఈ ఉద్యోగం చేజిక్కించుకునేందుకు అభ్యర్ధులకు కంప్యూటర్ ఇంజనీరింగ్ డిగ్రీ, కోడింగ్ నైపుణ్యాలు అవసరం లేకపోవడం గమనార్హం. ఏఐ టూల్స్ సామర్ధ్యాలను మెరుగుపరిచి, యూజర్ల ప్రశ్నలకు అవి మరింత కచ్చితత్వంతో సరైన స్పందనలు అందించేలా చేయడమే ప్రాంప్ట్ ఇంజనీర్ల కీలక బాధ్యతలు.
చాట్‌జీపీటీ, గూగుల్ బార్డ్ వంటి ఏఐ అప్లికేషన్లను సాధికారికంగా మలచడంలో ప్రాంప్ట్ ఇంజనీర్లదే ప్రధాన పాత్ర. ఏఐ టూల్స్‌పై ట్రైనింగ్‌తో పాటు వాటిని సమర్ధంగా వినియోగించేందుకు కంపెనీలు ప్రాంప్ట్ ఇంజనీర్లను రిక్రూట్ చేసుకుంటుండటంతో ఏఐ సంబంధిత కొలువులకు డిమాండ్ పెరుగుతోంది. ప్రాంప్ట్ ఇంజనీర్లకు భారీ వేతనాలిచ్చేందుకు కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి. జనరేటివ్ ఏఐ, జీపీటీ పేరుతో జాబ్ పోస్టింగ్స్ ఇటీవల విపరీతంగా పెరుగుతున్నాయని లింక్డిన్ డేటా వెల్లడిస్తోంది. పలు రంగాలకు చెందిన అనేక కంపెనీలు ఈ పొజిషన్స్‌లో రిక్రూట్‌మెంట్స్‌ను చేపట్టాయి.
Read More :