ఈ ఈఎల్ఎస్ఎస్ ఫండ్‌లో రూ.10వేల చొప్పున పెట్టుబడితో రిటర్న్స్ ఎంతో తెలుసా?!
HDFC Tax Saver Fund | ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ఫం `హెచ్డీఎఫ్సీ టాక్స్ సేవర్ ఫండ్`పెట్టుబడితో 22% లాభం పొందొచ్చు.
HDFC Tax Saver Fund | ఈఎల్ఎస్ఎస్.. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్.. ఒక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్ – SIP ) కింద అమలు చేస్తున్న టాక్స్ సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్. ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద ప్రత్యేకమైన ఇన్వెస్ట్మెంట్ టూల్స్ ( specific investment ) కింద రూ.1.5 లక్షల వరకు ఆదాయం పెట్టుబడి పెట్టినా.. టాక్సబుల్ ఇన్‌కం నుంచి మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు.
ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో పెట్టుబడులతో టాక్స్ అడ్వాంటేజ్తోపాటు బంపర్ రిటర్న్స్ అందిస్తాయి. ఈ ఈఎల్ఎస్ఎస్ కింద పెట్టుబడి పెట్టిన స్టాక్స్ అపరిమితంగా లాభ పడితే ఈ పథకం మదుపర్లకు రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి. లార్జ్, స్మాల్-క్యాప్, మిడ్-క్యాప్ కంపెనీలతోపాటు వివిధ శ్రేణుల మార్కెట్ క్యాపిటలైజేషన్ గల సంస్థలు, విభిన్న ఈక్విటీస్‌లో ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ పెట్టుబడిగా పెడతారు. 26 ఏండ్ల క్రితం ప్రారంభమైన ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ అసాధారణ ఫలితాలనిస్తున్నది.
హెచ్డీఎఫ్సీ టాక్స్ సేవర్ ఫండ్ స్కీమ్ 26 ఏండ్లు పూర్తి చేసుకోవడంతోపాటు ఇందులో పెట్టుబడి పెట్టిన మదుపర్లను కోటీశ్వరులను చేసింది. హెచ్డీఎఫ్సీ టాక్స్ సేవర్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్-గ్రోత్ ఆప్షన్‌తో కూడిన స్కీమ్ 1996 మార్చిలో ప్రారంభించారు. 2022 మార్చి 31 నాటికి ఈ పథకంలో పెట్టుబడులు పెట్టిన వారికి 21.27 శాతం రిటర్న్స్ వచ్చాయి. నిఫ్టీ-500 ట్రైబెంచ్ మార్క్ స్టాక్స్ 15.45 శాతం, నిఫ్టీ-50 అడిషనల్ బెంచ్ మార్క్ సంస్థల్లో పెట్టుబడులు 14.35 శాతం రిటర్న్స్ వచ్చాయి.
గత 26 ఏండ్లలో ప్రతి నెలా రూ.10 వేల చొప్పున సిప్ కింద పెట్టిన పెట్టుబడులు రూ.31.20 లక్షలకు చేరాయి. గత మార్చి 31 నాటికి ఈ రూ.31.20 లక్షలు రూ.9.39 కోట్లు కార్పస్ నిధిగా మారాయి. ఏడాది కాలం పెట్టుబడులపై 26.05 శాతం రిటర్న్స్ వచ్చాయి. ఈ పథకం బెంచ్‌మార్క్ రిటర్న్స్ కంటే 22.29 శాతం ఎక్కువ. గత మూడేండ్ల రిటర్న్స్ కంటే 11.64 శాతం అధికం. గత ఐదేండ్లతో పోటిస్తే 9.44 శాతం ఎక్కువ. ఈఎల్ఎస్ఎస్ కింద హెచ్డీఎఫ్సీ టాక్స్ సేవర్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్ ప్రారంభించినప్పటి నుంచి సగటున ఏటా 22.24 శాతం రిటర్న్స్ అందించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

