Hyundai Creta | గత నెలలో దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) క్రెటా కారు అత్యధికంగా అమ్ముడైంది. గత నెలలో అమ్ముడైన టాప్-10 కార్లలో మారుతి సుజుకి స్విఫ్ట్, మారుతి సుజుకి వ్యాగన్ ఆర్, టాటా పంచ్, టాటా నెక్సాన్, మహీంద్రా స్కార్పియో వంటి కార్ల కంటే ముందు వరుసలో నిలిచింది. జూలైలో అమ్ముడైన టాప్-10 కార్లలో మారుతి సుజుకి ఆరు, టాటా మోటార్స్ రెండు, హ్యుండాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలు ఒక్కో మోడల్ కార్లు విక్రయించాయి.
గత నెలలో హ్యుండాయ్ క్రెటా 17,350 యూనిట్లు విక్రయించింది. తర్వాతీ స్థానంలో మారుతి సుజుకి స్విఫ్ట్ 16,854, మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ 16,191 యూనిట్లు అమ్ముడయ్యాయి. టాటా పంచ్ 16,121 కార్లు విక్రయించగా, మారుతి సుజుకి ఎర్టిగా 15,701 యూనిట్లు, మారుతి సుజుకి బ్రెజా 14,676 యూనిట్లు అమ్ముడయ్యాయి.
టాటా నెక్సాన్ 13,902 యూనిట్ల కార్లు విక్రయించి తన స్థానాన్ని మెరుగు పర్చుకున్నది. మహీంద్రా స్కార్పియో (ఎన్ అండ్ క్లాసిక్) కార్లు 12,237 యూనిట్లు అమ్ముడు అయ్యాయి. మారుతి ఎకో 11,916 కార్ల విక్రయంతో తొమ్మిదో స్థానంలో, మారుతి సుజుకి డిజైర్ 11,647 కార్ల విక్రయంతో టాప్-10 ర్యాంకు సంపాదించాయి.
హ్యుండాయ్ క్రెటా – 17,350
మారుతి సుజుకి స్విఫ్ట్ – 16,854
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ – 16,191
టాటా పంచ్ – 16,121
మారుతి సుజుకి ఎర్టిగ – 15,701
మారుతి సుజుకి బ్రెజా- 14,676
టాటా నెక్సాన్ – 13,902
మహీంద్రా స్కార్పియో – 12,237
మారుతి సుజుకి ఎకో – 11,916
మారుతి సుజుకి డిజైర్ -11,647