
IPPB Shock | ప్రతి పల్లెలో.. పట్నంలో అందుబాటులో ఉండేది పోస్టాఫీసు.. బ్యాంక్ అవతారం ఎత్తకముందే చిన్న మొత్తాల పొదుపు ఖాతాలు నిర్వహించింది. ఇక బ్యాంక్ లైసెన్స్ పొందిన ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) అన్ని రకాల సేవలందిస్తున్నది. ఇతర బ్యాంకులతోపాటు ఐపీపీబీ కూడా ఆయా సేవల చార్జీలు ఇబ్బడిముబ్బడిగా పెంచేసింది. శనివారం నుంచి ఈ చార్జీలు అమల్లోకి వచ్చాయి. ఆయా పొదుపు ఖాతాల్లో డబ్బు డిపాజిట్, విత్ డ్రాయల్స్ ఇప్పటి వరకు ఉచితం. బ్యాంక్ ఏటీఎంల్లో నిర్దిష్ట పరిమితులు దాటితే అదనపు చార్జీలు విధించినట్లే.. నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌కు పరిమితులు విధించింది.
ఐపీపీబీలోని బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల్లో ఉచితంగా విత్‌డ్రాయల్స్‌కు మాత్రం పరిమితులు విధించింది. ఆ పరిమితులు దాటితే మాత్రం చార్జీలు వసూలు చేస్తామని గతేడాదే ఐపీపీబీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చార్జీలకు జీఎస్టీ, సెస్ కూడా అదనంగా వర్తిస్తాయి. ప్రతి నెలలో నాలుగు సార్లు ఉచితంగా చేసుకోవచ్చు. ఐదోసారి విత్‌డ్రాయల్ చేస్తే మాత్రం ప్రతి లావాదేవీకి కనీసం రూ.25 చార్జీ వసూలు చేస్తుంది.
పొదుపు ఖాతాల నుంచి ప్రతి నెలా రూ.25 వేల వరకు ఉచితంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. రూ.25 వేలు దాటితే మాత్రం ప్రతి విత్ డ్రాయల్‌పై రూ.25 చార్జీ వసూలు చేస్తుంది. ఇదే నిబంధన కరంట్ ఖాతాదారులకు వర్తిస్తుందని గత నవంబర్ 30న జారీ చేసిన నోటిఫికేషన్లో ఐపీపీబీ వెల్లడించింది.
సేవింగ్స్, కరంట్ ఖాతాల్లో రూ.10 వేల వరకు ఉచితంగా డిపాజిట్ చేయొచ్చు. ఆ లిమిట్ దాటిన డిపాజిట్లలో ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ.25 చార్జీ విధిస్తుంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) మూడు రకాల ఖాతాలు నిర్వహిస్తోంది. రెగ్యులర్ సేవింగ్స్ ఖాతా, డిజిటల్ సేవింగ్స్ ఖాతా, బేసిక్ సేవింగ్స్ అకౌంట్స్‌ను ఐపీపీబీ నిర్వహిస్తున్నది.