ITR Filing | తప్పుల్లేకుండా ఐటీఆర్ ఫైలింగ్ చేయాలంటే ఈ టిప్స్ అనుసరిస్తే సరి..!
ITR Filing | ఐటీఆర్ ఫైలింగ్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆడిటింగ్ అవసరం లేని వారు తప్పుల్లేకుండా ఫామ్ 16, ఏఐఎస్ ఫామ్ వివరాలను సరిపోల్చుకుని తప్పుల్లేకుండా ఐటీఆర్ ఫైల్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ITR Filing | వేతన జీవులు, చిరు వ్యాపారులు తమ ఆదాయాన్ని బట్టి ఐటీ రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేస్తారు. గత ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఈ నెల 31 తుది గడువు. ఐటీఆర్ ఫైల్ చేసే విషయంలో సరైన అవగాహన లేకున్నా, నిపుణుల సాయం లేకున్నా ఐటీఆర్ ఫైల్ చేయడం కాసింత కష్టమే. చాలా మంది వరకూ జాగ్రత్తగానే ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియ పూర్తి చేస్తారు కానీ.. గడువు దగ్గరకొస్తున్నా కొద్దీ తొందరపాటుతో పొరపాట్లు చేసే అవకాశాలు ఉన్నాయి. ఐటీఆర్ ల్లో దొర్లే తప్పులు సరిదిద్దుకోవచ్చు. అందుకు వెసులుబాటు కూడా ఉంది. రివైజ్డ్ ఐటీఆర్ కూడా ఫైల్ చేయొచ్చు గానీ అందుకు టైం కేటాయించడం చికాకు పరిచే అంశం. కనుక ముందే జాగ్రత్త వహిస్తే ఏ ఇబ్బందులు ఉండవు. కనుక ఐటీఆర్ ఫైలింగ్ టైంలో తప్పుల్లేకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..!
ఏయే ఫామ్ సెలక్ట్ చేసుకోవాలంటే..!
ఇప్పటికే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) జారీ చేసిన ఏడు రకాల ఐటీఆర్ ఫామ్స్‌లో సరైన ఫామ్ ఎంచుకోవాలి. రూ.50 లక్షల్లోపు ఆదాయం, ఒక ఇంటిపై ఇన్ కం, వడ్డీ తదితర రూపాల్లో ఆదాయం వస్తే ఐటీఆర్- 1 ఫైల్ చేయొచ్చు. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, రూ.50 లక్షల పై చిలుకు ఆదాయం గల సంస్థలు ఐటీఆర్-4 సెలెక్ట్ చేసుకోవాలి. వృత్తి నిపుణుల్లో ఐటీఆర్-1, ఐటీఆర్-2 విషయంలో అనుమానాలు ఉన్నట్లయితే ఐటీఆర్-3 సెలెక్ట్ చేసుకోవాలి. ఇక స్టాక్ మార్కెట్లలో షేర్ల క్రయ విక్రయాలు చేస్తే.. ఆయా లావాదేవీల ఆధారంగా ఐటీఆర్-2, ఐటీఆర్-3ల్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. కంపెనీలు, వ్యాపార సంస్థల యాజమాన్యాలు మిగతా ఫామ్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఇలా బ్యాంకు ఖాతా ధ్రువీకరణ.. ఐటీఆర్ వెరిఫికేషన్
ట్యాక్స్ పేయర్లంతా ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో తమ బ్యాంకు ఖాతాల వివరాలను ధ్రువీకరించాలి. దీంతో ట్యాక్స్ పేయర్ల బ్యాంక్ ఖాతా యాక్టీవ్ గా ఉందని నిర్ధారణ వస్తుంది. అలా నిర్ధారణ వస్తేనే ఆదాయం పన్ను విభాగం.. సంబంధిత పన్ను చెల్లింపుదారుడికి రీఫండ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఐటీఆర్ దాఖలు చేశాక, దాన్ని టాక్స్ పేయర్లు తప్పనిసరిగా వెరిఫై చేసుకోవాలి. అలా వెరిఫికేషన్ చేసుకుంటేనే ఐటీఆర్ ఫైలింగ్ పూర్తయినట్లు భావిస్తారు. లేకుంటే ఐటీ రిటర్న్స్ పరిగణనలోకి తీసుకోరు. ఐటీఆర్ ఫామ్ అప్ లోడ్ చేసిన 30 రోజుల్లోగా వెరిఫై చేసుకోవాల్సి ఉంటది.
ఇక డిడక్షన్ క్లయిమ్స్ ఇలా
ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ద్వారా ప్రతి ఒక్కరూ వివిధ పథకాల్లో మదుపు ద్వారా రూ.1.50 లక్షల వరకూ డిడక్షన్ క్లయిమ్ చేయొచ్చు. పిల్లల ట్యూషన్ ఫీజులు, ఇంటి రుణం అసలు, ఈపీఎఫ్, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ఎల్ఐసీ వంటి బీమా పాలసీ ప్రీమియం చెల్లింపులు ఈ సెక్షన్ కిందకు వస్తాయి. ఇక సెక్షన్ 80డీ కింద హెల్త్ బీమా ప్రీమియం వివరాలు రికార్డు చేయాలి. సేవింగ్స్ ఖాతాపై వచ్చే వడ్డీ ఆదాయం మీద రూ.10 వేల వరకూ 80టీటీఏ కింద డిడక్షన్ ఉంటుంది. సెక్షన్ 80జీజీ కింద హెచ్ఆర్ఏ క్లయిమ్ చేయొచ్చు. పన్ను ఆదాతోపాటు ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులు, ఇతర పెట్టుబడులు, ఖర్చులకు సంబంధించి ఐటీఆర్ లో సరైన వివరాలు నమోదు చేయాలి.
గడువు దాటితే ఫైన్ తప్పదు
ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయం ఐటీఆర్ ఫామ్ లో నమోదు చేయరు. వడ్డీ, కమిషన్ వంటి ఆదాయం గురించి ప్రస్తావించరు. వీటిపై టీడీఎస్ డిడక్ట్ చేస్తారని నమోదు చేయకుంటే తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గడువులోపు ఐటీఆర్ ఫైలింగ్ పూర్తి చేయాల్సిందే. గడువు దాటితే రూ.1000 – రూ.5,000 వరకు పెనాల్టీ పే చేయాలి.
ఫామ్16.. ఏఐఎస్ చెక్ చేసుకున్నాకే ఐటీఆర్ ఫైల్ చేయాలి
కొన్ని సందర్భాల్లో ఐటీఆర్ ఫైల్ చేసే వారి ఆదాయం పన్ను విభాగం వద్ద ఉన్న ఆదాయం వివరాలు, ఫామ్-16 వివరాలతో సరిపోలక పోవచ్చు. కంపెనీ యాజమాన్యం వసూలు చేసిన పన్ను జమ చేయకపోవడంతో వ్యత్యాసాలు ఉంటాయి. కనుక ఫామ్ 16, ఫామ్ 16ఏ, 26ఏఎస్, ఏఐఎస్ పూర్తిగా చెక్ చేసుకోవాలి. అటుపై మేనేజ్మెంట్ దృష్టికి తెచ్చి చెక్ చేసుకుని ఫైల్ చేయాలి. వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయం వివరాలన్నీ ఐటీఆర్ ఫైలింగ్ లో తప్పనిసరిగా నివేదించాలని, లేకపోతే ఆదాయం పన్నువిభాగం నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- AIS
- Business news
- Form-16
- ITR Filng
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

