S/B A/C High interest | ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) ఇన్వెస్టర్ల మాదిరిగానే వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతా కస్టమర్లు కూడా తక్కువ వడ్డీరేట్లపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేండ్లు బ్యాంకులు సేవింగ్స్ ఖాతాల్లో డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించేస్తున్నాయి. ఆ జాబితాలో ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ముందు వరుసలో నిలిచింది. ఆ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం సేవింగ్స్ ఖాతాలో రూ.10లక్షలకు పైగా నిల్వ ఉన్న డిపాజిట్లపై ఏడాదికి 2.8 శాతం వడ్డీరేటు మాత్రమే చెల్లిస్తున్నది. ఇతర పెద్ద బ్యాంకులూ ఇదే బాటలో పయనిస్తున్నాయి. కానీ ఇదే టైమ్‌లో కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకులు.. రూ. లక్ష పై చిలుకు డిపాజిట్లు గల తమ సేవింగ్స్ ఖాతాదారులకు అత్యధిక వడ్డీరేటు ఆఫర్ చేస్తున్నాయి. డిపాజిట్లు పెరుగుతున్నా కొద్దీ వడ్డీరేటు పెరుగుతుంది.
ఉదాహరణకు ఉజ్జివన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం సేవింగ్స్ ఖాతాల్లో రూ.లక్ష నుంచి రూ.25 లక్షల డిపాజిట్ల వరకు 7% వడ్డీరేట్ ఆఫర్ చేస్తున్నది. ఉదాహరణకు కస్టమర్ రూ.1.20 లక్షలు డిపాజిట్ చేస్తే రూ.లక్షపై 4%, మిగతా రూ.20వేలపై ఏడు శాతం వడ్డీ అందిస్తోంది.
జన బ్యాంకు తన బ్యాంకుల్లోని సేవింగ్స్ ఖాతాల్లో రూ. లక్ష నుంచి రూ.10 లక్షల డిపాజిట్లపై 6 శాతం వడ్డీ అందిస్తున్నది. సేవింగ్స్ ఖాతాలపై ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తున్న చిన్న ఫైనాన్స్ బ్యాంకుల సంగతి ఓసారి చూద్దాం.
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.
ఎస్బీఐ ఖాతాదారుల సేవింగ్స్ ఖాతాలపై 2020 మే 31 నుంచి 2.7 % వడ్డీరేటు
2020 జూన్ 4 నుంచి రూ.50 లక్షల పై చిలుకు డిపాజిట్లపై ఐసీఐసీఐలో మూడు శాతం.
కొటక్ మహీంద్రా బ్యాంకులో రూ.లక్ష సేవింగ్స్ ఖాతా డిపాజిట్‌పై 3.5 శాతం, రూ.లక్ష దాటితే 4%.
ఇటీవలే పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో వడ్డీరేట్లు తగ్గింపు.
పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాపై వార్షిక వడ్డీరేటు 4 శాతం.
ఖాతాదారులు డిపాజిట్ చేసిన సొమ్ము చెల్లించడంలో బ్యాంకు విఫలమైతే డీఐసీజీసీ వారికి బీమా ఆఫర్ చేస్తున్నది. గతేడాది ఫిబ్రవరి 4 నుంచి రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచేసింది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులను ఆర్బీఐ నియంత్రిస్తుంది. చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఫెయిలైతే డీఐసీజీసీ డిపాజిట్ బీమా పథకం కింద కస్టమర్లకు రూ.5 లక్షల వరకు చెల్లిస్తారు. ఈ ఇన్సూరెన్స్ సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, కరంట్ ఖాతాలు, రికరింగ్ డిపాజిట్లకు కూడా వర్తిస్తుంది.