SUVs- Cars | ఏప్రిల్ నుంచి ఆ కార్లు ఇక కనుమరుగు.. కారణం ఇదేనా?!
SUVs- Cars | రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (ఆర్డీఈ) రూల్స్ అమల్లోకి వస్తుండటంతో ఏప్రిల్ నుంచి 17 కార్లు, ఎస్‌యూవీలు కనుమరుగవుతాయి.
SUVs- Cars | పర్యావరణం దెబ్బ తినకుండా కర్బన ఉద్గారాలను మరింత నియంత్రించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నది. అందుకోసం వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ (ఆర్డీఈ) నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీంతో దేశీయ మార్కెట్ నుంచి పలు కార్లు, ఎస్‌యూవీలు కనుమరుగు కానున్నాయి. స్పీడ్, యాక్సిలరేషన్, డిసిలరేషన్లో తరుచుగా మార్పులు రావడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకసారి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే కార్ల తయారీ దారులు తమ కార్ల నుంచి ఉద్గారాలను తగ్గించడానికి వాటి ఇంజిన్లను అప్‌గ్రేడ్ చేయాలి. ప్రత్యేకించి డీజిల్ వినియోగ ఇంజిన్ల అప్‌గ్రెడేషన్ ఖర్చుతో కూడుకున్నది. దీంతో 27 కార్లు, ఎస్‌యూవీలు దేశీయ మార్కెట్ నుంచి కనుమరుగు కానున్నాయి.
ఆర్డీఈ నిబంధనల ప్రకారం.. కార్లలో ఆన్‌బోర్డ్ సెల్ఫ్-డయాగ్నోస్టిక్ డివైజ్ ఉండాల్సిందే. ఇది రియల్ టైం డ్రైవింగ్ ఎమిషన్ లెవెల్స్‌ను నిర్ధారిస్తుంది. ఆన్‌బోర్డు సెల్ఫ్ డయాగ్నొస్టిక్ డివైజ్ అనునిత్యం క్యాటలిక్ కన్వర్టర్, ఆక్సిజన్ సెన్సర్లు ఉద్గారాల నియంత్రణ ప్రమాణాలను అందుకుంటుందా? అని పర్యవేక్షిస్తుంది. క్రాంక్‌షాఫ్ట్ పొజిషన్స్, థ్రోట్టిల్, ఇంజిన్ టెంపరేచర్ తదితర అంశాలను నిర్ధారించడానికి కార్ల తయారీ దారులు సెమీ కండక్టర్లను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఇంధనం మండిపోకుండా నియంత్రించడానికి కార్లు, ఎస్‌యూవీల్లో ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్టర్లను ఏర్పాటు చేయాలి.
ఉద్గారాల నియంత్రణకు ఉపయోగించే `సెలెక్టివ్ క్యాటలిక్ రిడక్షన్ (ఎస్సీఆర్)` అత్యంత ఖర్చుతో కూడిన పని. దీనివల్ల డీజిల్ ఇంజిన్ కార్ల తయారీ ఖర్చు పెరుగుతుంది. కార్ల ధరతో పోలిస్తే చిన్న ఇంజిన్ల అప్‌గ్రెడేషన్ చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కంపాక్ట్ డీజిల్ కార్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని తెలుస్తున్నది. గత కొన్నేండ్లుగా డీజిల్ వేరియంట్ హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్లకు డిమాండ్ తగ్గుతూ వస్తున్నది.పెట్రోల్ వినియోగ కార్లలోనూ ఇంజిన్ల అప్‌గ్రెడేషన్ ఖర్చుతో కూడుకున్నదే. తత్ఫలితంగా వాటి ధరలు పెరుగుతాయి. అదే జరిగితే కొన్ని మోడల్ కార్లను ఆయా కార్ల తయారీ దారులు వదిలించుకోక తప్పదు.
కనుమరుగయ్యే కార్లివే..
- హోండాలోని సిటీ ఫోర్త్ జెన్, సిటీ ఫిఫ్త్ జెన్ (డీజిల్), అమేజ్ (డీజిల్), జాజ్, డబ్ల్యూఆర్-వీ.
- మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన మర్రాజో, అల్టూరస్ జీ4, కేయూవీ 100.
- హ్యుండాయ్ మోటార్స్‌లోని ఐ20, వెర్నా డీజిల్ మోడల్స్.
- స్కోడాకు చెందిన ఒక్టావియా, సూపర్బ్
- టాటా ఆల్ట్రోజ్ (డీజిల్)
- రెనాల్ట్ క్విడ్ 800
- నిసాన్ కిక్స్
- మారుతి సుజుకి ఆల్టో 800.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

