Tata Nexon | న్యూఢిల్లీ, మే 13: మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన నెక్సాన్‌లో నయా వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది టాటా మోటర్స్. ఎంట్రీ లెవల్ స్మార్ట్ రకం ప్రారంభ ధర రూ.7.99 లక్షలు. నాలుగు రకాల్లో లభించనున్న ఈ మాడల్ నెక్సాన్ స్మార్ట్ ధర రూ.8.15లక్షలు(పెట్రోల్), నెక్సాన్ స్మార్ట్ ప్లస్ రూ.9.20 లక్షలు(పెట్రోల్), డీజిల్ మాడల్ రూ.9.99 లక్షలు, స్మార్ట్ ప్లస్ ఎస్ మాడల్ పెట్రోల్ రకం రూ.9.80 లక్షలుగా నిర్ణయించింది.
పాత మాడల్‌తో పోలిస్తే ఎంట్రీ లెవల్ మాడల్ ధర రూ.16 వేలకు తక్కువకే విక్రయిస్తున్నది. ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్, 4 స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టేబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్స్‌తో రూపొందించింది.