నేడు ఆర్బీఐ పరపతి సమీక్ష
రిజర్వుబ్యాంక్ తన ద్రవ్య పరపతి సమీక్షను శుక్రవారం ప్రకటించనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రెండో ద్వైమాసిక పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచే అవకాశాలు మెండుగావున్నాయని, లేకపోతే వడ్డీరేట్లను పావు శాతం పెంచే అవకాశం ఉన్నదని పలువురు ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు.
ముంబై, జూన్ 4: రిజర్వుబ్యాంక్ తన ద్రవ్య పరపతి సమీక్షను శుక్రవారం ప్రకటించనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రెండో ద్వైమాసిక పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచే అవకాశాలు మెండుగావున్నాయని, లేకపోతే వడ్డీరేట్లను పావు శాతం పెంచే అవకాశం ఉన్నదని పలువురు ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చమురు ధరలు భగ్గుమనడంతో ధరల సూచీ ఆకాశమే హద్దుగా దూసుకుపోయే అవకాశాలుండటం ఈసారి సమీక్షలో రిజర్వుబ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నిర్ణయం కీలకంగా మారింది. ఆరుగురు సభ్యులు కలిగిన పరపతి సమీక్ష సమావేశం బుధవారం ప్రారంభమై శుక్రవారం తన నిర్ణయాన్ని ప్రకటించనున్నది.
ఈ సమీక్షపై పీటీఐ నిర్వహించిన పోల్‌లో పలువురు ఆర్థిక వేత్తలు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. వీరిలో 11 మంది వడ్డీరేట్ల యథాతథ స్థితికి ఓటు వేయగా, నలుగురు మాత్రం పావు శాతం పెంచే అవకాశం ఉన్నదని తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ద్రవ్యోల్బణ రిస్క్ కారణంగా ఈ ఏడాది సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను రెండు సార్లు సవరించే అవకాశాలున్నాయని అత్యధిక మంది అభిప్రాయపడ్డారు. ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి మాట్లాడుతూ..దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండటంతో ఆర్బీఐ కూడా ఈసారి వడ్డీరేట్లను స్థిరంగా ఉంచే అవకాశాలున్నాయన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

