హైదరాబాద్, ఫిబ్రవరి 11: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.264.83 కోట్ల ఆదాయంపై రూ.11.52 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన ఆదాయంలో 75 శాతం వృద్ధిని కనబరుచగా, నికర లాభంలో 59 శాతం ఎగబాకింది. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూ.5 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు 8 శాతం లేదా 40 పైసలు మధ్యంతర డివిడెండ్‌ను సంస్థ ప్రకటించింది. ఆదాయం రూ.2,610.69 కోట్ల నుంచి రూ.2,373.72 కోట్లకు పడిపోయింది. 2021-22కుగాను రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.1.31 లేదా 13.10 శాతం మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ప్రకటించింది.