దేశీయ స్టాక్ మార్కెట్లలో కొత్త ఏడాది (సంవత్ 2081) మొదలైంది. గత శుక్రవారం జరిగిన మూరత్ ట్రేడింగ్‌లో నూతన సంవత్సరానికి మదుపరులు లాభాలతోనే స్వాగతం పలికారు. అప్పటిదాకా నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న సూచీలు.. ఈ ప్రత్యేక ట్రేడింగ్‌తో లాభాలను సంతరించుకున్నాయి. ఫలితంగానే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 321.83 పాయింట్లు పెరిగి 79,724.12 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 123.55 పాయింట్లు అందుకుని 24,304.35 దగ్గర స్థిరపడింది. ఈ క్రమంలో ఈ వారం ఇన్వెస్టర్లు పెట్టుబడులకే మొగ్గుతారన్న అంచనాలైతే వస్తున్నాయి.
బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాల షేర్లపై ఫోకస్‌కు ఛాన్స్ ఉన్నది. అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 23,900 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 23,700 స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 24,600-24,800 మధ్యకు వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.గమనిక..: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. కాబట్టి ఇక్కడ ఒడిదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఏ బాధ్యత వహించదు. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.