హైదరాబాద్, ఫిబ్రవరి 9: హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్(హైసియా) ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా జాతీయ సమ్మిట్ జరగబోతున్నది. ఈ నెల 14న హైటెక్స్ వేదికగా జరగనున్న ఈ సదస్సును రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించనున్నారు.
31వ సారి జరుగుతున్న ఈ సదస్సులో ఐటీ ప్రొడక్స్ ఎక్స్పో, వార్షిక ఇండస్ట్రీ అవార్డులు కూడా అందిస్తున్నట్లు హైసియా ప్రెసిడెంట్ మనీషా సాబూ తెలిపారు. అలాగే ఐటీ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, టెక్ మహీంద్రా సీఈవో, ఎండీ సీపీ గుర్ణానీ, టీసీఎస్ ప్రెసిడెంట్ వీ రాజన్నలు హాజరవుతున్నారు.