హైదరాబాద్, ఏప్రిల్ 10 ( నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని కూకట్పల్లి ప్రాంతంలోని మంజీరా మాల్‌ను నిర్వహిస్తున్న మంజీరా రిటైల్ హోల్డింగ్స్ నిర్వహణను స్వాధీనం చేసుకునేందుకు లులు ఇంటర్నేషనల్ షాపింగ్‌మాల్‌కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్ సీఎల్ టీ) ఆమోదం తెలిపింది. మంజీరా మాల్‌ను హస్తగతం చేసుకోవడానికి మొత్తం 49 మంది పోటీ పడ్డారు.
వీరిలో అత్యధికంగా రూ.318.42 కోట్లకు లులు సంస్థ బిడ్డింగ్ వేసి దక్కించుకున్నది. ఇందు కు రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్పీ) అనుమతించింది. రుణాలు చెల్లించని మంజీరా కన్‌స్ట్రక్షన్స్‌పై దివాలా పరిషార ప్రక్రియ చేపట్టాలని కొంతకాలం క్రితం క్యాటలిస్ట్ ట్రస్టీషిప్ లిమిటెడ్ సంస్థ ఐబీసీ సెక్షన్-7 కింద ఎన్ సీఎల్ టీలో ఫిర్యాదు చేసింది.