హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): స్టార్టూన్ ల్యాబ్ రూపొందించిన వైద్య పరికరానికి అమెరికా ఔషధ నియంత్రణ మండలి ఎఫ్డీఏ నుంచి ఆమోదం లభించింది. ఈ స్టార్టప్ మెడిటెక్ విభాగంలో వైద్య రంగానికి సంబంధించిన పరికరాన్ని ఫీజీ పేరుతో రూపొందించారు. దీనికి ఇప్పటికే పెటెంట్ లభించగా, తాజాగా అమెరికాలోని ఎఫ్డీఏ నుంచి అనుమతి లభించడంతో ఎంతో ప్రాధాన్యత కలిగిన వైద్య పరికరంగా గుర్తింపు దక్కినట్లయిందని వ్యవస్థాపకుల్లో ఒకరైన మైత్రేయి కొండపి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ చేసుకునే అవకాశం కూడా లభించిందని ఆమె తెలిపారు.