ముంబై, మార్చి 24: మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగం శరవేగంగా వృద్ధిని నమోదు చేసుకుంటున్నది. ప్రతియేటా 7 శాతం వృద్ధితో 2028 నాటికి ఈ రంగం రూ.3.3 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఫిక్కీ-ఈవై ఎంఅండ్ఈ నివేదికలో వెల్లడించింది. 2025 నాటికి ఈ రంగం రూ.2.78 లక్షల కోట్లుగా నమోదైంది. దీంట్లో లక్ష కోట్ల రూపాయల స్థాయిలో ఉన్న డిజిటిల్ మీడియా అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్నది.
డిజిటల్ ప్రకటనల ద్వారా రూ.94,700 కోట్ల ఆదాయం సమకూరుతున్నదని పేర్కొంది. గతేడాదితో పోలిస్తే 26 శాతం వృద్ధిని సాధించిందని వెల్లడించింది. మొత్తంమీద ప్రకటనల ఇండస్ట్రీ 13.5 శాతం వృద్ధితో రూ.1.5 లక్షల కోట్లకు చేరుకున్నది.