RBI | ఎండలు, వర్షాల ఆధారంగా వడ్డీరేట్ల సవరింపులు.. వాతావరణంతో ఆర్బీఐకి లింకేంటి?
ఎండల తీవ్రత, కుండపోత వర్షాలు సాధారణ ప్రజానీకానికే కాదు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కూ అసౌకర్యంగానే ఉంటాయి. ఆర్బీఐని అత్యంత ప్రభావితం చేసే అంశాల్లో వాతావరణం ఎప్పటికీ ముందు వరుసలో ఉంటుందన్నది మీకు తెలుసా మరి? అవును.. ఆర్బీఐ నిర్ణయాల్లో కీలకమైన వడ్డీరేట్ల సవరింపులు వాతావరణ పరిస్థితుల ఆధారంగానే ఉంటాయి.
- రాబోయే ద్రవ్యసమీక్షల్లోని నిర్ణయాలూ అంతే
RBI | ముంబై, మే 20: ఎండల తీవ్రత, కుండపోత వర్షాలు సాధారణ ప్రజానీకానికే కాదు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కూ అసౌకర్యంగానే ఉంటాయి. ఆర్బీఐని అత్యంత ప్రభావితం చేసే అంశాల్లో వాతావరణం ఎప్పటికీ ముందు వరుసలో ఉంటుందన్నది మీకు తెలుసా మరి? అవును.. ఆర్బీఐ నిర్ణయాల్లో కీలకమైన వడ్డీరేట్ల సవరింపులు వాతావరణ పరిస్థితుల ఆధారంగానే ఉంటాయి. రెండు నెలలకోసారి జరుపుతున్న ద్రవ్యవిధాన పరపతి సమీక్షల్లో వెదర్ రిపోర్టుదే ప్రధాన పాత్ర. ఇంకా గట్టిగా చెప్పాలంటే యావత్తు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతే వాతావరణంపై ఆధారపడి ఉంటుందన్నా అతిశయోక్తి కాదు.
ఇదీ సంగతి..
భారత్.. ఇప్పటికీ వర్షాధార పంటల దేశమే. ఇక ఆర్బీఐ ద్రవ్యవిధానం.. ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యాల (4 శాతం)కు అనుగుణంగా సాగుతుంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నా, వర్షాలు సమృద్ధిగా కురవకపోయినా లేదా అతిగా కురిసినా.. పంట దిగుబడులు తగ్గిపోతాయి. ఇదే జరిగితే మార్కెట్లో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక ద్రవ్యోల్బణం పెచ్చుమీరుతుంది. అప్పుడు దాన్ని తగ్గించేందుకు ఆర్బీఐ.. రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను పెంచుతుంది. దీనివల్ల బ్యాంకుల రుణాలపై వడ్డీరేట్లు పెరుగుతాయి. ఇది సగటు మనిషి నుంచి, భారీ సంస్థలు, పరిశ్రమలదాకా ఎంతటి ప్రభావం చూపుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈసారీ యథాతథమే..
వచ్చే నెల జరుగబోయే ద్రవ్యసమీక్షలోనూ రెపోరేటును ఆర్బీఐ యథాతథంగానే ఉంచుతుందన్న అంచనాలున్నాయి. ఏడాదికిపైగా కాలం నుంచి రెపోరేటును ఆర్బీఐ 6.5 శాతం వద్దే ఉంచుతున్నది. అయితే ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిస్తే దీన్ని తగ్గించే వీలుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల ప్రభావం కూడా ఉన్నప్పటికీ.. వాతావరణం బాగుంటే మాత్రం ఆ అంశానికి ఆర్బీఐ ఈ దఫా అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చని అంటున్నారు. మొత్తానికి వాతావరణం ఆశించినట్టుగా ఉంటే రుణభారం తగ్గొచ్చని చెప్పవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

