న్యూఢిల్లీ, మార్చి 10: గత కొన్ని నెలలుగా నిరాశాజనక పనితీరు కనబరిచిన పారిశ్రామిక రంగం తిరిగి పుంజుకున్నది. జనవరి నెలకుగాను పారిశ్రామికం 5.2 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 2 శాతంతో పోలిస్తే భారీగా పెరిగింది.
జాతీయ గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. జనవరిలో తయారీ రంగం 3.7 శాతానికి, గనులు 8.8 శాతానికి, పవర్ ఉత్పత్తి 12.7 శాతం పెరిగింది.