న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ప్యాసింజర్ వాహనాలకు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. దేశవ్యాప్తంగా పెళ్లిళ్లసీజన్ కావడంతో ప్యాసింజర్ వాహనాలకు జోష్ పెంచిందని ఫెడరేషన్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్(ఫాడా) తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. జనవరి నెలలో 3,93,250 యూనిట్ల పీవీలు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 3,47,086 యూనిట్లతో పోలిస్తే 13 శాతం అధికమని పేర్కొంది.
నూతన మాడళ్లతోపాటు ఎస్యూవీ వాహనాలకు డిమాండ్ ఉండటం వల్లనే రికార్డు స్థాయికి విక్రయాలు చేరుకున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కూడా కావడం ఇందుకు కలిసొచ్చింది.
– మనీష్ రాజ్ సింఘానియా, ఫాడా ప్రెసిడెంట్