హైదరాబాద్, మే 15: వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, చెన్నైలలో సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్టు ది ఎగ్జిక్యూటివ్ సెంటర్(టీఈసీ) ప్రకటించింది. దక్షిణాదిలో మార్కెట్లో వ్యాపార విస్తరణ కోసం 4.65 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పిన ఆఫీస్ స్థలంతో 6 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
వీటిలో బెంగళూరులో 91 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పనున్న ఆఫీస్ స్థలంలో 1,100 మందికి ఉపాధి లభించనుండగా, అలాగే హైదరాబాద్‌లో 2.04 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఆఫీస్ స్పేస్‌లో 2,820 మంది కూర్చోవడానికి వీలుంటుంది.