న్యూఢిల్లీ, జనవరి 8: పసిడి దిగుమతుల డాటాను కేంద్ర ప్రభుత్వం సవరించింది. నవంబర్ నెలలో 5 బిలియన్ డాలర్ల బంగారం మాత్రమే దిగుమతైందని వెల్లడించింది. గతంలో 9.84 బిలియన్ డాలర్లు అయినట్లు తెలిపింది.
ఇన్బౌండ్ షిప్మెంట్లో డబుల్ అకౌంటింగ్ను సరిచేయడం వల్లనే దిగుమతులు తగ్గాయని కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. అలాగే ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఎనిమిది నెలల్లో దిగుమతులు కూడా 11.7 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు తెలిపింది.