న్యూఢిల్లీ, జనవరి 20: రాబోయే బడ్జెట్లో డెట్ ఫండ్ల కోసం ఇండెక్సేషన్ ప్రయోజనాలను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) డిమాండ్ చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ను ప్రవేశ పెడుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)కు అనుగుణంగా పన్ను ప్రయోజనాలను అందించాలని యాంఫీ కోరింది. మరోవైపు ఈసారి బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ స్లాబులను కుదించాలని గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) డిమాండ్ చేసింది. స్టీల్ ఇండస్ట్రీ సైతం బడ్జెట్లో ప్రోత్సాహకాలను ఆశిస్తున్నది.