Tesla Cars Recall | టెస్లా కీలక నిర్ణయం.. రెండు లక్షల కార్లు రీకాల్.. కారణమిదే.. !
Tesla Cars Recall | సాఫ్ట్ వేర్లో సాంకేతిక లోపం తలెత్తిన సుమారు రెండు లక్షల కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ప్రకటించింది.
Tesla Cars Recall | సాఫ్ట్ వేర్లో సాంకేతిక లోపం తలెత్తిన సుమారు రెండు లక్షల కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ప్రకటించింది. బ్యాకప్ కెమెరా డార్క్‌గా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రివర్స్ చేస్తున్నప్పుడు అమెరికాలో టెస్లా కార్ల బ్యాకప్ కెమెరా పని చేయడం లేదని ఫిర్యాదులు వచ్చాయి. రీకాల్ చేస్తున్న కార్లలో 2023లో విడుదల చేసిన `వై`, `ఎస్`, `ఎక్స్` మోడల్ కార్లు ఉన్నాయి. `ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్` ఆప్షన్‌తో ఈ కార్లు పని చేస్తాయి. ఇందుకోసం ఆయా కార్లలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ 4.0.. 2023.44.30.6 లేదా 2023.44.100 ద్వారా 2023.44.30 సాఫ్ట్‌వేర్‌పై నడుస్తాయి.
టెస్లా కార్లను రివర్స్ చేస్తున్నప్పుడు కెమెరా ఇమేజ్‌లను తొలగించడంలో సాఫ్ట్వేర్ పని చేయడం లేదని యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తులో తేలిందని టెస్లా తెలిపింది. దీనివల్ల కార్లు ప్రమాదానికి గురైనట్లు ఆధారాలు లేవని టెస్లా పేర్కొంది. కానీ సాఫ్ట్వేర్ లోపం వల్ల కార్లు క్రాష్ అయ్యే ముప్పు ఉందని యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించింది. గతేడాది డిసెంబర్ చివర్లో కార్ల యజమానులు తమకు ఫిర్యాదులు చేశారని టెస్లా తెలిపింది. ఈ నెల 12న సదరు కార్లను రీకాల్ చేయాలని టెస్లా నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఈనెల 22న 81 మంది కార్ల యజమానుల నుంచి సమస్యపై వారంటీ క్లయిమ్‌లు వచ్చాయని తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

