ముంబై, ఫిబ్రవరి 19: నిరుద్యోగులకు శుభవార్తను అందించింది టెస్లా పవర్ ఇండియా. వ్యాపార విస్తరణలో భాగంగా 2 వేల మంది సిబ్బందిని నియమించుకునే యోచనలో సంస్థ ఉన్నది. ఇంజినీరింగ్, ఆపరేషన్స్, సేల్స్, మార్కెటింగ్, అనుబంధ విభాగాల్లో యువతను నియమించుకోనున్నట్లు సోమవారం ప్రకటించింది.
సైస్టెనబుల్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యుషన్స్ సేవలను అందిస్తున్న టెస్లా పవర్..ఇటీవల రిస్టోర్ బ్యాటరీ బ్రాండ్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. 2026 నాటికి దేశవ్యాప్తంగా 5 వేల రిస్టోర్ యూనిట్లను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ అందుకు తగ్గట్టుగానే ప్రణాళికను వేగవంతం చేసినట్లు టెస్లా పవర్ ఇండియా ఎండీ కవిందర్ ఖురానా తెలిపారు.