Tesla Super Chargers | గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. విద్యుత్ కార్లు.. వాహనాల చార్జింగ్ మౌలిక వసతుల కల్పన దిశగా అడుగులేస్తున్నది. ఇతర సంస్థల కార్లు, వాహనాలనూ చార్జింగ్ చేసుకోవచ్చు. ఈ దిశగా నెదర్లాండ్స్లో పైలట్ ప్రారంభించబోతున్నది. ప్రారంభ దశలో నెదర్లాండ్స్లో 10 సూపర్ చార్జర్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాం. వాటి వద్ద టెస్లాయేతర ఎలక్ట్రిక్ వాహనాలనూ చార్జింగ్ చేసుకోవచ్చు. అందుకోసం టెస్లా యాప్ (4.2.3 వర్షన్ లేదా అంతకంటే ఉన్నతస్థాయి) అందుబాటులోకి తెచ్చాం. ఈ చార్జింగ్ స్టేషన్ల వద్ద ట్రాఫిక్.. వినియోగదారుల అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటూ నిరంతరం పర్యవేక్షణ సాగిస్తాం అని టెస్లా ఓ ప్రకటనలో తెలిపింది.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా టెస్లా 25 వేల సూపర్ చార్జర్లను ఏర్పాటు చేసింది. 2012లోనే సూపర్ చార్జర్ నెట్వర్క్ నిర్మాణం ప్రారంభించింది. నాన్-టెస్లా వెహికల్స్ కోసం సూపర్ చార్జర్లను అందుబాటులోకి తేనున్నట్లు చాలా కాలం క్రితమే టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ప్రకటించారు. బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, డాల్మియర్, ఫోర్డ్, ఫోక్స్ వ్యాగన్, ఆడి, పొర్చే కార్లకు విద్యుత్ చార్జింగ్ కోసం కంబైన్డ్ చార్జింగ్ సిస్టమ్ (సీసీఎస్) అందుబాటులోకి తెస్తోంది. చార్జింగ్ మెంబర్షిప్ కల వారికి చార్జింగ్ ప్రైస్ తక్కువగా ఉంటుందని టెస్లా తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
myrtle corbin | నాలుగు కాళ్లు.. రెండు జననేంద్రియాలు.. ఆమె పుట్టుక ఇప్పటికీ మిస్టరీనే
Tavolara | ఆ రాజ్యంలో ఉండేది కేవలం 11 మందే.. మరి రాజుగారి పనేంటో తెలుసా !
అబ్రహం లింకన్ గడ్డం పెంచడం వెనుక ఉన్న కథేంటో తెలుసా !