న్యూఢిల్లీ, ఆగస్టు 3: మహీంద్రాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన సంస్థ మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లిమిటెడ్‌లో రూ.1,200 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లు సింగపూర్‌కు చెందిన సావరిన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ టెమ్సెక్ ప్రకటించింది. నాలుగు చక్రాల ఈవీల తయారీ సంస్థ విలువ రూ.80,580 కోట్లు. ఈ సందర్భంగా మహీంద్రా ఎండీ, సీఈవో అనిశ్ షా మాట్లాడుతూ..అంతర్జాతీయ మార్కెట్లో మరింత పట్టు సాధించడానికి ఈ పెట్టుబడులు ఉపయోగపడనున్నాయన్నారు.