హైదరాబాద్, జూన్ 20: టెలికం దిగ్గజం రిలయన్స్ జియో దూసుకుపోతున్నది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తెలుగు రాష్ర్టాల్లో కంపెనీ నెట్‌వర్క్‌లోకి కొత్తగా 1.56 లక్షల మంది చేరారు. టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,56,296 మంది నూతన సబ్‌స్ర్కైబర్లు చేరడంతో మొత్తం సంఖ్య 3.29 కోట్లకు చేరుకున్నారు.