Expo-2022 Dubai | 9 నుంచి దుబాయ్‌లో ఎక్స్పో.. స్టార్టప్‌ల శక్తి సామర్థ్యాలపై తెలంగాణ ప్రదర్శన
Expo-2022 Dubai | 9- 12 మధ్య దుబాయ్‌లో జరిగే ఎక్స్‌పోలో పారిశ్రామికవేత్తల బృందం రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరించనున్నది.

Expo-2022 Dubai | దుబాయిలో మంగళవారం (నవంబర్ 9) నుంచి ఈ నెల 12 వరకు జరిగే ఇండస్ట్రీయల్ ఎక్స్పో జరుగనున్నది. ఈ ఎక్స్‌పోలో ఇండియా పెవిలియన్‌లో రాష్ట్ర స్టార్టప్‌ల శక్తి సామర్థ్యాలు, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల విజయగాధలను తెలంగాణ ప్రభుత్వం ప్రదర్శించనున్నది. ఎక్స్‌పోలో జరిగే ఈవెంట్స్, మీటింగ్స్‌లో ఇన్నోవేటివ్ ఐడియాలు, ఉత్పత్తులు, సర్వీసుల రంగాల్లో వ్యాపార అవకాశాలపై రాష్ట్ర స్టార్టప్‌లు, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు వివరిస్తారు. పెట్టుబడులకు, స్టార్టప్ ఎకో సిస్టమ్‌కు తెలంగాణ మెరుగైందని పేర్కొంటూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆహ్వానించనున్నారు.
తెలంగాణ ప్రతినిధి బృందానికి ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ), చాంబర్ మెంబర్ ఆఫ్ ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్ఐసీసీఐ) అధ్యక్షుడు కే భాస్కర్‌రెడ్డి సారధ్యం వహిస్తారు. మొత్తం 17 మంది ప్రతినిధులు ఈ ఎక్స్‌పోలో పాల్గొంటారు. సమావేశాలు, ఈవెంట్లలో తెలంగాణలో బిజినెస్ ఒప్పందాలకు గల అవకాశాలపై ఫోకస్ చేస్తారు.
ఎఫ్‌టీసీసీఐ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్-జీవక ఇండస్ట్రీస్ ఎండీ అనిల్ అగర్వాల్, సుధాకర్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఎండీ-ఎఫ్‌టీసీసీఐ వైస్‌ప్రెసిడెంట్ మీలా జయదేవ్, పొకర్ణ సీఎండీ గౌతం తదితరులు ఈ ప్రతినిధి బృందంలో పాల్గొంటారు. ఐదుగురు మహిళా పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన ఐదు స్టార్టప్‌లతోపాటు మొత్తం 14 స్టార్టప్‌లు ఇందులో పాల్గొంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Dubai Expo 2020
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

