సత్తాచాటుతున్న తెలంగాణ కంపెనీలు.. గత ఐదేండ్లలో రోజుకు రూ.283 కోట్లు పెరిగిన సంపద
రాష్ర్టానికి చెందిన పలు కార్పొరేట్ సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్నాయి. తాజాగా యాక్సిస్ బ్యాంక్‌నకు చెందిన బర్గండీ ప్రైవేట్, హురున్ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన 2025 బర్గుండీ ప్రైవేట్ హురున్ ఇండియా 500 జాబితాలో తెలంగాణ నుంచి 39 సంస్థలు చోటు దక్కించుకున్నాయి.
- 2025 బర్గండీ ప్రైవేట్ హురున్ ఇండియా-500లో వెల్లడి
హైదరాబాద్, జూన్ 24 : రాష్ర్టానికి చెందిన పలు కార్పొరేట్ సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్నాయి. తాజాగా యాక్సిస్ బ్యాంక్‌నకు చెందిన బర్గండీ ప్రైవేట్, హురున్ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన 2025 బర్గుండీ ప్రైవేట్ హురున్ ఇండియా 500 జాబితాలో తెలంగాణ నుంచి 39 సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితా విడుదలైనప్పటీ నుంచి ఇప్పటి వరకు మరో తొమ్మిది సంస్థలు చోటు దక్కించుకోవడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ దిగ్గజాల నికర విలువ రూ.12.1 లక్షల కోట్లుగా నమోదైంది. 2021లో నమోదైన రూ.5.2 లక్షల కోట్ల కంపెనీల విలువతో పోలిస్తే ఇది 75 శాతం అధికమని పేర్కొంది.
అలాగే ఈ జాబితాలో దేశీయ ఫార్మా దిగ్గజాల్లో ఒకటైన దివీస్ ల్యాబ్ రాష్ట్ర జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1.7 లక్షల కోట్లు. అలాగే ఆ తర్వాత స్థానాల్లో డాక్టర్ రెడ్డీస్ రూ.1.1 లక్షల కోట్లు, మేఘా ఇంజినీరింగ్ రూ.83,800 కోట్లతో నిలిచాయి. గత ఐదేండ్లలో హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న కంపెనీలు ప్రతిరోజూ దాదాపు రూ.283 కోట్ల సంపదను పోగేశాయి. ప్రభుత్వరంగ సంస్థలు, అనుబంధ సంస్థలను మినహాయించి ఈ జాబితాను రూపొందించింది. ఏప్రిల్ 30, 2026 నాటికి రూ.10,230 కోట్లు(1.1 బిలియన్ డాలర్లు) కంటే అధిక విలువ కలిగి సంస్థలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 7 శాతం అధికం.
ముఖ్యాంశాలు
- 2025 బర్గండీ ప్రైవేట్ హురున్ ఇండియా 500 జాబితాలో రాష్ర్టానికి చెందిన 39 కంపెనీలు చోటు దక్కించుకున్నాయి.
- రాష్ట్రంలో కంపెనీల మొత్తం విలువ రూ.12.1 లక్షల కోట్లుగా ఉన్నది. 2021 నమోదైన కంపెనీల విలువతో రూ.5.2 లక్షల కోట్లతో పోలిస్తే 75 శాతం అధికం.
- ఈ జాబితాలో రూ.1.7 లక్షల కోట్ల విలువతో దివీస్ ల్యాబ్ అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో రూ.1.1 లక్షల కోట్లతో డాక్టర్ రెడ్డీస్ నిలువగా, రూ.83,800 కోట్ల విలువతో మేఘా ఇంజినీరింగ్ ఆ తర్వాతి స్థానంలో నిలిచింది.
- ఈ జాబితాలో చోటు దక్కించుకున్న కంపెనీల విక్రయాలు రూ.2.6 లక్షల కోట్లకు చేరాయి. 2021లో నమోదైన రూ.83,625 కోట్లతో పోలిస్తే 47 శాతం అధికం.
- మొత్తంగా 3.4 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఐదేండ్ల క్రితం నమోదైన దాని కంటే 70 శాతం అధికం.
- మహిళా ఉద్యోగుల్లో 8,480 మందితో డాక్టర్ రెడ్డీస్ తొలిస్థానంలో నిలువగా, 8,143 మందితో మెడ్‌ప్లస్, 3,427 మందితో రెయిన్బో ఆ తర్వాత స్థానంలో ఉన్నది.

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

