Tecno Spark Go 1 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో (Tecno) తన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ టెక్నో స్పార్క్ గో 1 (Tecno Spark Go 1).. త్వరలో భారత్‌తోపాటు గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించనున్నది. దీని ధర సుమారు రూ.8400 (100 డాలర్లు) ఉండొచ్చునని భావిస్తున్నారు. ఆవిష్కరణ టైం లైన్ తెలియదు కానీ బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో టెక్నో స్పార్క్ గో1 (Tecno Spark Go1) ఫోన్ లభిస్తుందని సమాచారం. గతేడాది డిసెంబర్ నె లలో టెక్నో స్పార్క్ గో 2024 (Tecno Spark Go 2024) ఫోన్ ఆవిష్కరించింది.
టెక్నో స్పార్క్ గో1 (Tecno Spark Go1) ఫోన్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తోపాటు డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్ కలిగి ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం టాప్‌లో సెంటర్డ్ హోల్ పంచ్ స్లాట్ తో ఫ్రంట్ కెమెరా వస్తుంది. ఈ ఫోన్ 720×1600 పిక్సెల్స్ రిజొల్యూషన్ తోపాటు 6.67 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది. యూనిసోక్ టీ615 ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్ ఓఎస్ వర్షన్ పై పని చేస్తుందని తెలుస్తోంది.
టెక్నో స్పార్క్ గో1 (Tecno Spark Go1) ఫోన్ 13-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ సెన్సర్ ఉంటాయి. 15వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో పని చేస్తుంది.