Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,10,134.58 కోట్లు కోల్పోయి, రూ.14,15,793.83 కోట్లకు పరిమితమైంది. టాప్-10 సంస్థల్లో టీసీఎస్తోపాటు ఐదు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.98 లక్షల కోట్లు పతనమైంది. వాటిలో ఇన్ఫోసిస్, ఎఫ్ఎంసీజీ మేజర్ హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఉన్నాయి. ఇన్ఫీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.52,291.05 కోట్లు నష్టపోయి రూ.6,26,280.51 కోట్లకు పరిమితం కాగా, హెచ్యూఎల్ రూ.16.834.82 కోట్లు పతనమై రూ.5,30,126.53 కోట్ల వద్ద నిలిచింది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఎం-క్యాప్ రూ.11.701.24 కోట్ల పతనంతో రూ.5,73,266.17 కోట్లకు చేరుకున్నది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.6,996.87 కోట్లు కోల్పోయి రూ.10,96,154.91 కోట్లతో సరిపెట్టుకున్నది.
మరోవైపు రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.49,152.89 కోట్లు పెరిగి రూ.19,68,748.04 కోట్లకు చేరుకున్నది. ఎస్బీఐ, ఐటీసీ, భారత్ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పుంజుకున్నది. ఎస్బీఐ ఎం-క్యాప్ రూ.12,851.44 కోట్లు పెరిగి రూ.6,66,133.03 కోట్లు, ఐటీసీ ఎం-క్యాప్ రూ.11,108.51 కోట్ల లబ్ధితో రూ.5,34,768.59 కోట్లకు, భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ.9,430.48 కోట్లు లాభ పడి రూ.6,98,855.66 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.8,191.79 కోట్లు పుంజుకుని రూ.7,65,409.98 కోట్లకు చేరుకున్నది.
గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో రిలయన్స్ మొదటి స్థానంలో కొనసాగుతున్నది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), ఇన్ఫోసిస్, ఎల్ఐసీ, ఐటీసీ, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) నిలిచాయి.